ఎటు చూసినా వీడియో కాల్స్, ఎవరిది పై చేయి?

గూగుల్ బాటలోనే వాట్సాప్, హైక్ మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ కూడా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఇటీవల లాంచ్ చేసాయి.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వీడియో కాలింగ్ అనుభూతులను చేరువ చేసే క్రమంలో సాప్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కొద్ది నెలల క్రితం Duo పేరుతో వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఎటు చూసినా వీడియో కాల్స్, ఎవరిది పై చేయి?

తాజాగా.. గూగుల్ బాటలోనే వాట్సాప్, హైక్ మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ కూడా వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేసాయి. ఫీచర్ల పరంగా చూస్తే వాట్సాప్ ఇంకా హైక్ మెసెంజర్‌లతో పోలిస్తే గూగుల్ డ్యుయో వెనకంజలో ఉందనే చెప్పాలి. వాట్సాప్, హైక్ మెసెంజర్‌లు వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో గూగుల్ డ్యుయోకు మార్కెట్లో క్రేజ్ తగ్గుతుందనటానికి 5 కారణాలు...

Read More : సంచలనం రేపుతోన్న Flipkart ఆఫర్లు

సింగిల్ క్లిక్‌తో..

సింగిల్ క్లిక్‌తో..

వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో యాప్‌ను హ్యాండిల్ చేయటం అంత సులభంగా అనిపించదు.

 డ్యుయోలో వీడియో కాలింగ్ మాత్రమే..

డ్యుయోలో వీడియో కాలింగ్ మాత్రమే..

గూగుల్ డ్యుయో యాప్ కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే ఉపకరిస్తుంది. ఇదే సమయంలో వాట్సాప్, హైక్ యూజర్లు వీడియో కాల్స్‌తో పాటు వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసెజ్‌లు పంపుకోవచ్చు, ఫోటోలను కూడా ఎడిల్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఈ రెండు యాప్‌లలో కొలువుతీరి ఉండటం విశేషం.

కాల్స్‌కు వేగవంతంగా కనెక్ట్ అయ్యే అవకాశం..
 

కాల్స్‌కు వేగవంతంగా కనెక్ట్ అయ్యే అవకాశం..

గూగుల్ డ్యుయో యాప్‌తో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ను వేగవంతంగా కనెక్ట్ అవుతాయి. గూగుల్ డ్యుయో యాప్ లో వీడియో
కాల్ ద్వారా ఫ్రెండ్ కు కనెక్ట్ అయ్యేందుకు చాలా సేపు వెయిట్ చేయవల్సి ఉంటుంది.

వందల కోట్ల యూజర్లు..

వందల కోట్ల యూజర్లు..

‌గూగుల్ డ్యుయోతో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల యూజర్లను కలిగి ఉన్నాయి.

2జీ నెట్‌వర్క్‌లోనూ వీడియో కాల్స్...

2జీ నెట్‌వర్క్‌లోనూ వీడియో కాల్స్...

మీరు 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో ద్వారా వీడియో కాల్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా 3జీ లేదా 4జీ కనెక్షన్ ఉండి తీరాలి.

Best Mobiles in India

English summary
5 Reasons Why WhatsApp, Hike Messenger Could Beat Google Duo in Video Calling. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X