డిసెంబర్ 25న ఆధార్ పేమెంట్ యాప్ విడుదల

ఐడీఎఫ్‌సీ బ్యాంక్, UIDAI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఈ యాప్ ను సంయుక్తంగా అభివృద్థి చేసినట్లు తెలుస్తోంది.

నగదురహిత లావాదేవీలను మరింత సులభతరం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన 'ఆధార్ పేమెంట్ యాప్'(Aadhaar Payment App) డిసెంబర్ 25న లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. నోట్ల రద్దు తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల పై అనేక విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ యాప్ అందుబాటలోకి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : కొత్త సినిమాలు రూ.20కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంయుక్తంగా అభివృద్థి చేసాయి..

ఐడీఎఫ్‌సీ బ్యాంక్, UIDAI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు ఈ యాప్‌ను సంయుక్తంగా అభివృద్థి చేసినట్లు తెలుస్తోంది. మర్చెంట్స్ ఈ ఆధార్ పేమెంట్ యాప్‌ను ముందుగా తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేుసుకోవల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ రీడర్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది

నోకియా నుంచి ఫేస్‌బుక్ వరకు, 2016లో కొనుగోళ్లు ఇవే!

మర్చెంట్స్ ఈ ఆధార్ పేమెంట్ యాప్‌ను ముందుగా తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేుసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లను బయోమెట్రిక్ రీడర్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ రీడర్స్‌ను ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంచారు. వీటి ధర రూ.2,000.

వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచినట్లయితే..

ఈ యాప్ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ఎటువంటి కార్డ్ నెంబర్స్ గానీ, పిన్ నెంబర్స్ గానీ అవసరం ఉండదు. యాప్‌లో కస్టమర్ ఆధార్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్యాంక్ వివరాలను సెలక్ట్ చేుసుకున్నట్లయితే, బయోమెట్రిక్ స్కాన్ అడుగుతుంది. అప్పుడు, వినియోగదారుడు తన వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచినట్లయితే లావాదేవీ విజయవంతమవుతుంది.

40 కోట్ల ఆధార్ నెంబర్లు

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40 కోట్ల ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ లను అనుసంధానమై ఉన్నట్లు తెలుస్తోంది.

స్వైపింగ్ మిషన్లకు డిమాండ్..

దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్వైపింగ్ మిషన్లకు డిమాండ్ పెరిగింది. ఇంతే కాకుండా.. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా లావాదేవీలు జరిపే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయలో పేటీఎమ్, ఫ్రీఛార్జ్, మొబీవిక్ వంటి మొబైల్ వాలెట్ యాప్‌లను ఉపయోగించుకునే వారిక సంక్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Aadhaar Payment App to launch tomorrow. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting