కష్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యాప్‌‌

By Hazarath
|

ఇండియాలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ఈ మధ్య ఓపెన్ నెట్ వర్క్ అంటూ ఓ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టిన విషయం విదితమే.ఎయిర్ టెల్ నెట్ వర్క్ టవర్స్ ఎక్కడుంటాయి. వాటి సిగ్నల్ బలమెంత ఉంటుంది...ఈ సమాచారం మొత్తాన్ని వినియోగదారులకు అందజేసే యాప్ ఇది. అయితే ఈ యాప్ తో అనేక సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆ సమస్యలేంటో మీరే చూడండి.

Read more: మొదటి ఫ్లాష్ సేల్‌లో లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు..

1.

1.

షాకింగ్ లాంటి న్యూస్ ఏంటంటే ఈ ఓపెన్ నెట్ వర్క్ యాప్ ఎయిర్ టెల్ గ్రూపు పరిధిలోనే లేదు.

2.

2.

మీరు ఓపెన్ నెట్ వర్క్ అని సెర్చ్ చేస్తే కౌపెన్ యారీ అనే సంస్థ అభివృద్ధి చేసిన యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే, అదే ఎయిర్ టెల్ ఓపెన్ నెట్ వర్క్ యాప్ అవుతుంది.

3.

3.

ఇక సిగ్నల్ పూర్తిగా పనిచేయదట. ఇంట్లో నాలుగు గోడల మధ్యా ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయదు. కారణం లొకేషన్ ను జీపీఎస్ సరిగ్గా గుర్తించలేదు.మీరు ఇంట్లో సిగ్నల్ చూసుకోవాలంటే, పిన్ కోడ్ ను మాన్యువల్ గా ఎంటర్ చేయాలి.

4.

4.

మంచి డేటా, వాయిస్ క్వాలిటీ ఉందని యాప్ చెబుతున్నా, కాల్స్ చేసేటప్పుడు సరిగ్గా వినపడక, ఇంటర్నెట్ సరిగ్గా రాక కస్టమర్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

5.

5.

ఇక ఎయిర్ టెల్ మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఎక్కడెక్కడ టవర్లు రావాలని కోరుతున్నారో ఈ యాప్ ద్వారా మిమ్మల్ని అడుగుతోంది. సిగ్నల్స్ లేని చోట్ల టవర్ కావాలని కోరేందుకు ప్రయత్నించిన పలువురు నిరాశకు గురిఅయ్యారని సమాచారం.

6.

6.

టవర్ల గురించి ఫిర్యాదు చేయాలని చూసిన వారికి ఓ అడ్వయిజర్ తో మాట్లాడాలని ఎయిర్ టెల్ నుంచి సమాధానం వస్తున్నట్టు సమాచారం. దీంతో నెట్ వర్క్ యాప్ తో పెద్దగా ఉపయోగమేమీ లేనట్టేనని వాడకందారులు పెదవి విరుస్తున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Many gaps in Airtel network app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X