భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

By Hazarath
|

శాస్ర్తవేత్తలు సరికొత్త యాప్ ను కనుగొన్నారు. ఈ యాప్ ఎక్కడైనా భూకంపం వస్తుందని తెలియగానే అందర్నీ ముందుగా అలర్ట్ చేస్తుంది. మీకు కిలోమీటర్ల దూరంలో ఏమైనా భూకంపాలు వస్తున్నాయని తెలిసినా ఈ యాప్ ద్వారా మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఈ సరికొత్త సరికొత్త మొబైల్ యాప్ ను కాలిఫోర్నియా, బెర్కెలీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ యాప్ పేరు మై షేక్. రాత్రి, పగలు అనే లేకుండా సిగ్నల్స్ ఇవ్వడం ఆ యాప్ ప్రత్యేకత.

 

Read more: ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది

my shake

గత మూడు నెలల్లో చిలీ, అర్జెంటైనా, మెక్సికో, జపాన్, తైవాన్, న్యూజీలాండ్, నేపాల్, మొరాకో, ఇతర దేశాలలో భూకంపాలు సంభవించినప్పుడు మై షేక్ యాప్ వర్క్ చేసింది. గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) కూడా అలర్ట్ రావడంతో హెల్ప్ చేస్తుందని, ఈ ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రయోగం ఫలించిందని వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. అదే సమయంలో 1.7 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని, అందులో 11 వేల ఫోన్ల సమాచారాని తమ డాటా నెట్‌వర్క్ కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. రిక్టర్ స్కేలుపై 2.5 నుంచి అధిక తీవ్రత భూకంపాలపై అలర్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని వివరించారు.

Read more: ప్రమాదంలో 4 కోట్ల మంది ఇండియన్లు

my shake

ఏప్రిల్ 16 న ఈక్వెడార్ లో సంభవించిన 7.8 తీవ్రత భూకంపాన్ని కూడా ఈ యాప్ గుర్తించిందని, భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చేసిన సెన్సార్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో మై షేక్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చని చెప్పారు. మరి కొన్ని రోజుల్లో మరింత సమాచారం అందజేస్తామని వర్సిటీ సైంటిస్టులు పేర్కొన్నారు. శతాబ్దాల నుంచి ప్రపంచంలో జరిగిన అతి భయంకర వైపరీత్యాలను తెలుసుకుంటే ఒళ్లు జలదరించడం ఖాయం.. ప్రపంచానికి షాక్‌ కొట్టించిన వైపరీత్యాలు ఇవే.

Read more: తొలి సునామి దెబ్బకు లక్షల ఏళ్లు

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

హైతీలో 2010 జనవరి 12 న భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం రాజధాని పోర్ట్- అవ్-ప్రిన్స్ కి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెక్టర్ స్కేల్ మీద 7.3 తీవ్రతతో నగరాన్ని కుదిపేసింది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

4 లక్షల టన్నుల TNT పేలితే ఎంతశక్తి విడుదలవుతుందో, అంత శక్తిగలదీ భూకంపం. ఇంతస్తాయిలో 230 ఏళ్ళలో ఎన్నడూ రాలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 250000 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 30 వేల వ్యాపార భవనాలు పడిపోయాయి. 3 లక్షలమంది చనిపోయి ఉంటారని అంచనా. 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షలమందిని పూడ్చిపెట్టినట్లు ప్రధాని జీన్ మాక్స్ బెల్లిరైవ్ ఫిబ్రవరి రెండున ప్రకటించాడు.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది
 

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

ఉత్తర హిందూ మహా సముద్రంలో పుట్టిన ఈ తొలి సైక్లోన్ దెబ్బకు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 84,500 మంది మరణించారని లెక్క తేల్చారు. మయన్మార్ మెత్తం శవాలదిబ్బగా మారింది. 53, 800 మంది ప్రజలు ఈసైక్లోన్ దెబ్బకు గల్లంతయ్యారు. వరదలతో విరుచుకుపడిన ఈ సైక్లోన్ చరిత్రలో తొలి విధ్వంసక సైక్లోన్ గా తన పేరును లిఖించుకుంది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

అత్యంత దారుణమైన భూకంపం ఇది. పాకిస్తాన్‌లో 2005లో సంభవించింది. ఈ భూకంపంలో 75వేల మంది మరణించారు.రిక్టర్ స్కేలుపై దాదాపు 7.5 తీవ్రత నమోదైంది. లక్షా ఆరు వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. అమెరికా తన వంతు సాయంగా 5.4 బిలియన్ల డాలర్లను అప్పుడు బాధితులకు ప్రకటించింది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

2005లో హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి , లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనం చేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1,000 మంది మరణానికి కారణమయ్యింది.దాదాపు 81 బిలియన్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

20వ శతాబ్దంలోనే అత్యంత పెద్ద అగ్ని పర్వతంగా దీన్ని చెబుతారు. నవంబర్ 13,1985లో పేలిన ఈ అగ్ని పర్వంతం దెబ్బకు ఊళ్లకు ఊళ్లే మాడిమసైపోయాయి. ఈ పర్వతం బద్దలవడంతో అందలోనుంచి బయటకు ఎగజిమ్మిన లావా దెబ్బకు 25000 మంది ప్రజలు మాడి మసైపోయారు. చరిత్రలో అతి పెద్ద విషాదంగా నిలిచిపోయింది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

1976 జులై 28న ఒక్కసారిగా భూమి బద్దలయిందా అంటూ సంభవించిన ఈ భూకంపం చైనాలో 2,40 వేల మందిని తనలో కలిపేసుకుంది. 1,64 మందిని గాయాల పాలు చేసింది. రిక్టర్ స్కేలుపై 7.8గా దీని తీవ్రత నమోదైంది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

ఆఫ్రికాలో విరుచుకుపడిన ఈ సైక్లోన్ దెబ్బకు 26 బిలియన్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.యుఎస్ చరిత్రలోనే ఆస్తినష్టం కలిగించిన అతి పెద్ద తుఫానుల్లో ఇది అయిదవది.

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

భూకంపాలను పసిగట్టే యాప్ వచ్చేసింది

9.0 రిక్టర్ స్కేలుతో వచ్చిన ఈ భూకంపం జపాన్ ను మట్టి దిబ్బగా మార్చింది. ఈ సునామి దెబ్బకు ఫుకుషిమా అణు కేంద్రం దెబ్బతింది. 15 మీటర్ల ఎత్తున విరుచుకుపడిన రాకాసి అల అణు కేంద్రానికి సంబంధించిన విద్యుత్, శీతలీకరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాల భద్రతపై ఆందోళన మొదలైంది. ఇది ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద భూకంపం

Best Mobiles in India

English summary
Here Write New smartphone app MyShake can detect earthquakes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X