మోడీ రూ. 500 ఉచిత రీఛార్జ్, లింక్ చూసారా..?

ప్రధాని నరేంద్రమోడీ నిజంగానే ఆ ఆఫర్ ఇస్తున్నారా..నగదు కొరతతో ఉచితంగా రీ ఛార్జ్ ఇస్తున్నారా..?

By Hazarath
|

ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ పేరుమీద ఓ మెసేజ్ వాట్సప్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రీగా రూ. 500 రీఛార్జ్ ఇస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే అది నిజమేనా... ప్రధాని నరేంద్రమోడీ నిజంగానే ఆ ఆఫర్ ఇస్తున్నారా..నగదు కొరతతో ఉచితంగా రీ ఛార్జ్ ఇస్తున్నారా..ఇలాంటి విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఈ యాప్ జియో, వాట్సప్‍లను సైతం హడలెత్తిస్తోంది

లింక్ మీద క్లిక్ చేస్తే

లింక్ మీద క్లిక్ చేస్తే

మీకు పంపించే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఉచితంగా రూ .500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న విషయం విదితమే.

వ్యక్తిగత సమాచారమంతా

వ్యక్తిగత సమాచారమంతా

నోట్ల రద్దు తర్వాత ఈ లింకు భారీగా షేర్ అవుతోంది. నగదు కొరతతో నిజంగానే మోడీ మనకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నాడమోనని భావించి, చాలామంది ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. దీంతో మన వ్యక్తిగత సమాచారమంతా లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట.

ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా

ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా

ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/ ఈ లింకు ఫేకని వెల్లడైంది.

మరో 15 మంది స్నేహితులకు

మరో 15 మంది స్నేహితులకు

 ఆ లింకును క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు అందించాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని అడుగుతోంది.

హోమ్ పేజీలో

హోమ్ పేజీలో

అయితే ఈ వెబ్‌సైట్‌లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. అదేవిధంగా ఈ హోమ్ పేజీలోనే తాము ఏ టెలికాం కంపెనీకి చెందిన వాళ్లం కాదని నిబంధనలు, షరతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు.

 వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా

వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా

వాట్సప్ మొదటిసారి వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి ఓ ఫేక్ మెసేజ్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు జారీఅవుతున్నాయి.

Best Mobiles in India

English summary
No, PM Modi Is Not Offering Free Mobile Recharges Worth Rs. 500 via WhatsApp read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X