Pokemon Go ఇండియాలో లాంచ్ అయ్యింది

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

|

2016, మొబైల్ వీడియో గేమ్స్ విభాగంలో సంచలనాలు సృష్టస్తోన్న పోక్‌మాన్ గో (Pokemon Go) ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. ఈ రియాల్టీ మొబైల్ గేమ్‌ను అభివృద్థి చేసిన నియాంటిక్ ఇంక్, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో మంగళవారం
మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్‌తో Moto M మార్కెట్లో లాంచ్ అయ్యింది

గూగుల్ ప్లే స్టోర్ నుంచి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో తెలిపింది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ రియాల్టీ గేమ్‌ను జియో యూజర్లు మార్చి 31, 2017 వరకు ఉచితంగా ఆడుకోవచ్చు.

 టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది

టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది

ఇప్పటికి వరకు మార్కెట్లో లాంచ్ అయిన అన్ని ఆండ్రాయిడ్ గేమ్స్‌తో పోలిస్తే Pokemon Go టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ గేమ్‌కు అలవాటుపడుతోన్న జనం వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. ఈ గేమ్ కారణంగా ప్రపంచదేశాల్లో అనేక ప్రమాదాల కూడా చోటుచేసుకున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంతకీ ఈ గేమింగ్ యాప్‌లో ప్రత్యేకత ఏంటి..?
 

ఇంతకీ ఈ గేమింగ్ యాప్‌లో ప్రత్యేకత ఏంటి..?

ఈ గేమింగ్ యాప్‌లో Pokemon పేరుతో ఓ బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మను మనం పట్టుకోవాలి. ఈ గేమ్ ఆడే ముందు ఫోన్ జీపీఎస్‌ను ఆన్ చేయవల్సి ఉంటుంది. జీపీఎస్ ఆన్ చేయటం వల్ల, మనం ఉన్న వీధుల్లో పోక్‌మాన్ బొమ్మ పరిగెడుతున్న యూజర్ ఇంటర్ పేస్ ఫోన్ స్ర్కీన్ ప్రత్యక్షమువుతుంది. ఈ బొమ్మను పట్టుకునేందుకు, అది వెళ్లిన వీధుల్లో మనం తిరగాల్సి ఉంటుంది.

జాగ్రత్తగా ఉండాలి..

జాగ్రత్తగా ఉండాలి..

ఈ గేమ్ ఆడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరికలు జారీ చేయటం విశేషం. అచ్చం సెల్ఫీల సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో అలాంటివే ఈ గేమ్ ఆడేసమయంలో జరుగుతున్నాయట.

ప్రమాదాలకు కూడా కారణం..

ప్రమాదాలకు కూడా కారణం..

ఆ మధ్య ఒకమ్మాయి ఈ గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటి వెళుతుండగా ఆమె ఢీకొట్టడం నుంచి తప్పించి వరుసగా కార్లు ఢీకొని గాల్లో లేస్తున్న కనీసం తన చుట్టు ఏం జరుగుతుందనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిందట.

గూగుల్ సెర్చ్‌లో టాప్‌ప్లేస్

గూగుల్ సెర్చ్‌లో టాప్‌ప్లేస్

గూగుల్ సెర్చ్‌లో టాప్‌ప్లేస్ ఆక్రమించుకున్న గేమ్ ఇదొక్కటే. ఇది లాంచ్ చేసిన వారంలోనే మిటియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఒక్క యుఎస్ లోనే60 శాతం మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఈ గేమ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Pokemon Go Finally Launched in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X