ఛాలెంజ్‌కు రెడీ అయితే..శాంసంగ్ బంపరాఫర్

యాప్‌లను రూపొందించే డెవలపర్లకు లక్షల్లో క్యాష్ రివార్డులు.

Written By:

స్మార్ట్‌ఫోన్ యాప్ డెవలపర్లకు శాంసంగ్ బంఫరాఫర్ ఇచ్చింది. 9 నెలలు పాటు సాగే ఈ చాలెంజ్ కాంటెస్ట్ తో లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తమ సొంత ఆపరేటింగ్ సిస్థం టైజన్‌లో కొత్త యాప్ డిజైన్లను రూపొందించే టెకీలకు భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఛాలెంజ్ వివరాలు ఎలా ఉంటాయో మీరే చూడండి.

IRCTCతో పనిలేదు, రైల్వే టికెట్ బుకింగ్ చాలా ఈజీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ కష్టాలు

మొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన శాంసంగ్ ఆపరేటింగ్ విషయంలో మాత్రం ఆండ్రాయిడ్‌పై ఆధారపడాల్సి వస్తోంది. శాంసంగ్ నుంచి వచ్చిన ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ మీదనే పనిచేస్తున్నాయి.

సొంత ఓఎస్ కోసం కునికిపాట్లు

దీంతో సొంత ఓఎస్ ను రూపొందించుకోవాలని శాంసంగ్ ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందులో భాగంగా టైజన్‌ను తీసుకొచ్చింది. అయితే టైజన్‌ను ఎంత విస్తరించినప్పటికీ ఫలితాలు మాత్రం నిరాశనే మిగులుస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టైజన్లో ఎక్కువగా యాప్‌లు లేకపోవటమే

దీనికి ప్రధాన కారణం టైజన్లో ఎక్కువగా యాప్‌లు లేకపోవటమేనని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో లక్షల యాప్‌లు ఉన్నాయి. అందుకే ఆ ఓఎస్‌లు వినియోగదారులను బాగా ఆకట్టుకోగలుగుతున్నాయి.

లక్షల్లో క్యాష్ రివార్డులు

అందుకే 'టైజన్' యాప్‌ల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టింది శాంసంగ్. తమ ఓఎస్‌లో యాప్‌లను రూపొందించే డెవలపర్లకు లక్షల్లో క్యాష్ రివార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

టైజన్ మొబైల్ యాప్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్

అందుకోసం తాజాగా 'టైజన్ మొబైల్ యాప్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. ఈ ఛాలెంజ్లో భాగంగా ప్రతి నెలా 10 లక్షల డాలర్లు (రూ .67.55 లక్షలు) బహుమతిగా ఇవ్వనుంది.

టాప్ 100 జాబితాలో నిలిచే యాప్లకు

టైజన్ స్టోర్'లో ప్రతి నెలా టాప్ 100 జాబితాలో నిలిచే యాప్లకు 10 వేల డాలర్ల (సుమారు రూ .6.7 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది.

ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ఛాలెంజ్ నిర్వహించబడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేవారు జనవరిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Offers Developers 10000 dollers Per App Via Tizen Mobile App Incentive Program Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting