వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు గమనించారా...

వాట్సప్‌లో మీరు ఛాట్ చేస్తున్నారా..ఒక వేళ ఛాట్ చేస్తుంటే కొత్తగా అప్‌డేట్ అయిన వివరాలను పరిశీలించారా..వాట్సప్ కొత్తగా కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.

By Hazarath
|

వాట్సప్‌లో మీరు ఛాట్ చేస్తున్నారా..ఒక వేళ ఛాట్ చేస్తుంటే కొత్తగా అప్‌డేట్ అయిన వివరాలను పరిశీలించారా..వాట్సప్ కొత్తగా కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 24వ తేదీ వాట్సప్ 8వ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటిస్తున్నట్లు వాట్సప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కౌమ్ తెలిపారు.దీంతో పాటు కొన్ని రకాల ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి. ఓ లుక్కేయండి.

 

గెలాక్సీ ఎస్8 రిలీజ్ ఆ రోజే, మార్చి 10న LG G6

మార్పు 1

మార్పు 1

ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.

కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే

కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే

ఇందులో 'స్టేటస్' కొత్తగా హోం స్క్రీన్ మీదకు వచ్చి చేరింది. ఇంతకుముందు సెట్టింగులలో స్టేటస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడు కనిపించే స్టేటస్ మరింత డైనమిక్‌గా ఉంది. ఇందులో మన కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయం కూడా మన 'స్టేటస్' గుర్తు కింద కనిపిస్తూ ఉంటుంది.

చిన్న పాటి వీడియో లేదా ఫొటోను
 

చిన్న పాటి వీడియో లేదా ఫొటోను

ఇంతకుముందు స్టేటస్‌ అంటే కేవలం ప్రొఫైల్ పిక్చర్ (డీపీ) మార్చడం, చిన్న వాక్యం ఏమైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పాటి వీడియో లేదా ఫొటోను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.

ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను

ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను

ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని, రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయవచ్చని వాట్సప్ ఓ ప్రకటనలో తెలిపింది.

స్టేటస్ మార్చినప్పుడు

స్టేటస్ మార్చినప్పుడు

మనం స్టేటస్ మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడచ్చో, ఎవరు చూడకూడదో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్టులలో ఉన్నవాళ్లంతా చూడచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీఫాల్ట్ మాత్రం మొదటిదే ఉంటుంది.

కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో

కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో

ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో కాంటాక్టులు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే.. మనం చాట్స్ అనే ట్యాబ్‌లో ఉన్నప్పుడు పైన సెర్చ్ బటన్ పక్కన ఉండే సింబల్‌ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు వస్తాయి.

Best Mobiles in India

English summary
WhatsApp Status Revamp Goes Official, Changes the Way You Use the Messaging App read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X