వాట్సప్ వీడియో కాలింగ్ వచ్చేసింది: పొందండిలా..

వాట్సప్ కాల్ ఎలా చేస్తామో అలాగే వీడియో కాల్ కూడా సులభంగా చెయ్యవచ్చు

By Hazarath
|

వాట్సప్ వినియోగదారులకు శుభవార్త. వాట్సప్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వాట్సప్ కాల్ ఎలా చేస్తామో అలాగే వీడియో కాల్ కూడా సులభంగా చెయ్యవచ్చు.ఎలాగంటే కాంటాక్ట్స్ లో కాల్ క్లిక్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. దానిలో మనకు నచ్చినది ఎంచుకోవాలి.

మీ కంప్యూటర్ స్లోగా ఉందా..ఇలా చేయండి

whatsapp video call

అవతలి వారు కూడా అప్ డేట్ చేసుకుని ఉంటేకాల్ వెళుతుంది. దీంతో పాటు ప్రస్తుత వాట్సప్ కాల్ ఎవరు అప్డేట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా కాల్ పూర్తయిన వెంటనే క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యాప్ రేటింగ్, ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. ఈ ఫీచర్ ని ఇప్పుడే పొందాలనుకునే వారు కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు.

IRCTCతో పనిలేదు, రైల్వే టికెట్ బుకింగ్ చాలా ఈజీ !

బీటా వర్సన్ అప్‌డేట్

బీటా వర్సన్ అప్‌డేట్

ముందుగా మీరు వాట్సప్ వాడుతున్నట్లయితే మీరు కొత్తగా వాట్సప్ బీటా వర్సన్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి వాట్సప్ బీటా వర్సన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్ కోసం క్లిక్ చేయండి.

 

 

apk ఫైల్‌ని డౌన్ లోడ్

apk ఫైల్‌ని డౌన్ లోడ్

ఆ తరువాత మీరు మరొక వర్షన్ వీడియోకి సంబంధించిన apk ఫైల్‌ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుంటేనే మీరు వీడియో కాలింగ్ ఫీచర్ పొందే అవకాశం ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్ కలర్ download apk

గ్రీన్ కలర్ download apk

ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు గ్రీన్ కలర్ download apk అని కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది డౌన్ లోడ్ చేసిన వెంటనే అది ఓపెన్ కాకపోవచ్చు ఎందుకంటే మీ ఫోన్ apk ఫైల్స్ సపోర్ట్ చేయకపోతే అది ఓపెన్ కాదు. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి apk ఇన్ స్టాలర్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

ఫోన్ లో ఇన్ స్టాల్

ఫోన్ లో ఇన్ స్టాల్

ఫైల్ ఓపెన్ అయిన తరువాత మీరు దాన్ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయండి. అయిపోగానే మీ వాట్సప్ సెట్టింగ్స్ లో ఓ సారి సిస్టం అప్ డేట్ కొట్టాలి. ఇందుకోసం మీరు settings లో About phone Helpలో కెళ్లి system statusని ఓ సారి అప్ డేట్ చేయాలి.

ప్రొపైల్ పై క్లిక్ చేస్తే

ప్రొపైల్ పై క్లిక్ చేస్తే

అయిపోయిన తరువాత మీరు ఏ నంబర్ కయితే కాల్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ ప్రొపైల్ పై క్లిక్ చేస్తే మీకు వాయిస్ కాల్ తో పాటు వీడియో కాల్ కూడా కనిపిస్తుంది. మీరు విజయవంతంగా వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు.

 

 

చాట్ చేస్తూనే వీడియో కాలింగ్

చాట్ చేస్తూనే వీడియో కాలింగ్

ఇందులో మీరు చాట్ చేస్తూనే వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
WhatsApp announced staged rollout of Video Calling feature for everyone in coming weeks Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X