ర్యామ్ గురించి ముఖ్యమైన విషయాలు

ఎక్కువ ర్యామ్‌తో వచ్చే గాడ్జెట్ ఏదైనా సరే వేగవంతమైన పనితీరును ఆఫర్ చేస్తుంది.

|

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఇలా ఏ వస్తువు కొనాలన్నా ముందుగా ఆయా గాడ్జెట్‌లలోని స్పెసిఫికేషన్‌లను క్షుణ్నంగా తెలుసుకోవల్సి ఉంటుంది. మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ గాడ్జెట్‌లలో ర్యామ్ (ర్యాండమ్ యాక్సెస్ మెమరీ) అనేది ముఖ్యమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్. ఎక్కువ ర్యామ్‌తో వచ్చే గాడ్జెట్ ఏదైనా సరే వేగవంతమైన పనితీరును ఆఫర్ చేస్తుంది. పోర్టబుల్ కమ్యూనికేషన్ డివైసెస్‌లో కీలకంగా భావిస్తోన్న ర్యామ్ గురించి పలు ఆసక్తికర విషయాలు..

Read More : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లేటెస్ట్‌గా ధర తగ్గిన ఫోన్స్ ఇవే

 తాత్కాలికంగా మాత్రమే మెమరీని స్టోర్ చేయగలగుతుంది

తాత్కాలికంగా మాత్రమే మెమరీని స్టోర్ చేయగలగుతుంది

ర్యామ్ ముఖ్యమైన చర్య మెమరీని అస్థిరంగా ఉంచటం. ర్యామ్‌లో స్టోర్ అయ్యే మెమరీ క్లియర్ చేసిన ప్రతిసారి చెరిగిపోతుంది. ర్యామ్ అనేది తాత్కాలికంగా మాత్రమే మెమరీని స్టోర్ చేయగలగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫోన్ లేదా కంప్యూటర్‌లో అప్పటికప్పుడు మనం ఉపయోగించుకునే డేటాను టెంపరరీగా స్టోర్ చేయటమే ర్యామ్ ప్రధాన లక్ష్యం.

ర్యామ్‌లు ఎన్నిరకాలు ఉంటాయ్..?

ర్యామ్‌లు ఎన్నిరకాలు ఉంటాయ్..?

ర్యామ్లు రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో మొదటి రకం డ్యుయల్ లైన్ మెమరీ మాడ్యుల్ దీన్నే క్లుప్తంగా DIMM అని కూడా పిలుస్తారు. ఎక్కువుగా ఈ తరహా ర్యామ్‌లను డెస్క్‌టాప్స్ అలానే సర్వర్స్‌లో ఉపయోగిస్తుంటారు.

మోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లుమోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లు

Small Outline DIMM
 

Small Outline DIMM

ఇక రెండవ రకం ర్యామ్ విషయానికి వచ్చేసరికి స్మాల్ అవుట్‌లైన్ డ్యుయల్ లైన్ మెమరీ మాడ్యుల్ వీటిని క్లుప్తంగా (Small Outline DIMM) అని పిలుస్తారు. ఈ పోర్టబుల్ సైజ్ ర్యామ్‌లను ప్రత్యేకించి ల్యాప్‌టాప్స్ అలానే చిన్న సైజు కంప్యూటర్‌లలో ఉపియోగిస్తారు.

DDR ర్యామ్ అంటే ఏంటి?

DDR ర్యామ్ అంటే ఏంటి?

DDR3 RAM అనే స్పెసిఫికేషన్‌ను చాలా డివైసెస్‌లో మనం చూస్తుంటాం. DDR అంటే డబుల్ డేటా రేట్ అని అర్థం. అంటే ఒక్కో క్లాక్ సైకిల్‌కు రెండు డేటా ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయని అర్థం. టెక్నాలజీ మరింతగా అభివృద్ది చెందటంతో DDR, DDR2, DDR3 ర్యామ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిలో DDR2 ర్యామ్ 240 పిన్‌లను కలిగి ఉంటుంది. పాత మెచీన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఈ ర్యామ్ ఉపయోగపడుతుంది.

అవి పాటించకుండా మొబైల్‌లో నెట్ వాడుతున్నారా..?అవి పాటించకుండా మొబైల్‌లో నెట్ వాడుతున్నారా..?

DDR3 మోడల్ ర్యామ్‌

DDR3 మోడల్ ర్యామ్‌

DDR3 మోడల్ ర్యామ్‌ను 2007లో విడుదల చేసారు. DDR2 తరహాలోనే DDR3 DIMMలలో కూడా 240 పిన్‌ల ఉంటాయి. తక్కువ వోల్టేజ్ కెపాసిటీలోని ఎక్కువ వేగంతో ఈ ర్యామ్ పనిచేస్తుంది.

DDR4 లేటెస్ట్ వర్షన్‌

DDR4 లేటెస్ట్ వర్షన్‌

ర్యామ్ కుటుంబంలో DDR4 DIMMను లేటెస్ట్ వర్షన్‌గా ర్యామ్‌గా భావించవచ్చు. 240 పిన్‌లును కలిగి ఉండే DDR4 ర్యామ్ 1.2 వోల్టేజ్ కెపాసిటీతో పనిచేస్తుంది. DDR3-1600, PC3-12800 నెంబర్‌లలో ర్యామ్‌లను రిఫర్ చేయటం జరుగుతుంది. DDR3-1600 ర్యామ్ సెకనుకు1600 మెగా ట్రాన్స్‌ఫర్‌లను జరుపుతుంది.

నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కీలక మార్పులునోకియా స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కీలక మార్పులు

Best Mobiles in India

English summary
All about RAM you need to know. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X