ఈ మిస్టేక్స్ మీ ఆఫీస్ కంప్యూటర్‌లో చేస్తున్నారా..?

టెక్నాలజీ వేగం పుంజుకునే కొద్దీ అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఫైల్స్ తో పని చేస్తే ఇప్పుడు అంతా కంప్యూటర్ల మీదే పనిచేస్తున్నారు.

By Hazarath
|

టెక్నాలజీ వేగం పుంజుకునే కొద్దీ అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఫైల్స్ తో పని చేస్తే ఇప్పుడు అంతా కంప్యూటర్ల మీదే పనిచేస్తున్నారు.ఉద్యోగులు ఆఫీసుకు వెళితే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సిందే. ప్రతి ఒక్కరికీ ఓ కంప్యూటర్ ఇచ్చి దాని ద్వారా ఆఫీసు పనులు చేయించుకుంటుంది మేనేజ్‌మెంట్. అయితే ఇలాంటి సమయంలో ఉద్యోగులు తమ పర్సనల్ పనులు చక్కబెట్టుకునేందుకు ఆఫీస్ కంప్యూటర్‌ని ఉపయోగిస్తారు. ఇలా వాడితే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాలి. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.

యూజర్లకు పేటీఎమ్ బంపరాఫర్

పర్సనల్ పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా సేవ్ చేయవద్దు.

పర్సనల్ పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా సేవ్ చేయవద్దు.

ఉద్యోగులు తమ వ్యక్తిగత అకౌంట్లకు చెందిన పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసు సిస్టంలో సేవ్ చేయరాదు. అలా చేస్తే పాస్‌వర్డ్‌లను ఎవరైనా ఈజీగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వారి సమాచారం తస్కరించబడుతుంది. ఆపైన నష్టం కలిగితే భరించక తప్పదు.

ఛాట్ కోసం యూజ్ చేయవద్దు

ఛాట్ కోసం యూజ్ చేయవద్దు

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లను పరిమిత స్థాయిలో వాడండి. అదే పనిగా వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. పై స్థాయి ఉద్యోగులు చూస్తే ఉద్యోగానికే ఎసరు రావచ్చు.

బ్యాకింగ్ సమాచారాన్ని సేవ్ చేయవద్దు

బ్యాకింగ్ సమాచారాన్ని సేవ్ చేయవద్దు

ఆఫీసులో కంప్యూటర్లను వాడుతున్న సమయంలో ఉద్యోగులు బ్యాంకింగ్ లావాదేవీలపై జాగ్రత్త వహించాలి. వారి క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఆ కంప్యూటర్‌లో సేవ్ చేయరాదు. అలా చేస్తే ఇతరులకు మీ వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బు నష్టపోతే బాధపడీ ప్రయోజనం ఉండదు.

మీ కంప్యూటర్‌ని ఇతరులకు ఇవ్వవద్దు

మీ కంప్యూటర్‌ని ఇతరులకు ఇవ్వవద్దు

ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు ఉద్యోగులు తమ తమ ఆఫీస్ కంప్యూటర్లను రిమోట్ కనెక్షన్ కోసం ఇవ్వకూడదు. అలా ఇస్తే ఉద్యోగుల ఆఫీస్‌కు చెందిన ముఖ్యమైన వివరాలను హ్యాకర్లు తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు కంపెనీకి భారీ నష్టం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది.

ఆఫీస్ పని మాత్రమే చేయండి

ఆఫీస్ పని మాత్రమే చేయండి

ఆఫీస్‌కు చెందిన కంప్యూటర్‌లో ఆఫీస్ పని కాకుండా ఇతరులకు చెందిన పని కూడా చేయకూడదు. ఒక వేళ ఆ పీసీలో ఉద్యోగి డేటా అంతా రికార్డ్ అయితే అప్పుడు ఆ ఉద్యోగికే ఇబ్బందులు ఎదురవుతాయి. అది జాబ్ కోల్పోయేందుకు కూడా దారి తీస్తుంది.

Best Mobiles in India

English summary
Five common mistakes to avoid on your work computer – and why they're so bad read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X