భారత్‌లో తక్కువ ఇంటర్నెట్ స్పీడ్: అకామై

|

ఆసియా దేశాల్లో భారత్ తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ 1.7ఎంబీపీఎస్ అని ఇంటర్నెట్ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ సంస్థ అకామై ‘స్టేట్ ఆఫ్ ద ఇంటర్నెట్' పేరిట విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్‌ను వేగవంతంగా అందిస్తున్న ఆసియా దేశాల జాబితాలో థాయిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, వియాత్నామ్ వంటి దేశాలో భారత్ కంటే ముందజలో ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

 
 భారత్‌లో తక్కువ ఇంటర్నెట్ స్పీడ్: అకామై

చిట్కా చెప్పిన ఇడియా!!

పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో ‘పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు...

 

- సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి.

- మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.

- మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

- మీ కంప్యూటర్ సీ డ్రైవ్ మీద, లేదంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన డ్రైవ్ పైన ఎక్కువగా భారం పడకుండా చూడండి. అంటే వీలైనన్ని తక్కువ ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్ చేస్తే మంచిది.

- మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. - డిస్క్ క్లీనప్‌‌ను రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X