LG కొత్త మానిటర్‌‌కు నాలుగు కంప్యూటర్లను కనెక్ట్ చేసుకోవచ్చు

ఒకేసారి నాలుగు స్ర్కీన్‌లను డిస్‌ప్లే చేయగలిగే మానిటర్..

|

42.5 అంగుళాల ప్యానల్‌తో, భారీ మానిటర్‌ను లాంచ్ చేసేందుకు ఎల్‌జీ కంపెనీ సిద్దమవుతోంది. ఎల్‌జీ 43UD79-B పేరుతో లాంచ్ కాబోతోన్న ఈ అల్ట్రా హైడెఫినిషన్ ప్యానల్ ఏకంగా 3840 × 2160రిసల్యూషన్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

Read More : రూ.10,000లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్, 4G VoLTE సపోర్ట్‌తో..

గేమింగ్ ప్రపంచాన్నే మార్చివేస్తుందని...

గేమింగ్ ప్రపంచాన్నే మార్చివేస్తుందని...

ఫ్రీసింగ్ వేరియబుల్ రీఫ్రెష్ టెక్నాలజీతో వస్తోన్న ఈ 4కే మానిటర్‌లో గేమ్ మోడ్, బ్లాక్ స్టెబిలైజర్, డైనమిక్ యాక్షన్ సింక్ (డీఏఎస్) మోడ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 60Hz రీఫ్రెష్ రేటుతో వస్తోన్న ఈ మానిటర్ గేమింగ్ ప్రపంచాన్నే మార్చివేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

1000:1 కాంట్రాస్ట్ రేషియో..

1000:1 కాంట్రాస్ట్ రేషియో..

1000:1 కాంట్రాస్ట్ రేషియో, 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉన్న ఈ 4కే మానిటర్ కొత్త అనుభూతులకు తెరలేపుతోంది.

ఒకేసారి నాలుగు డిస్‌ప్లేలు
 

ఒకేసారి నాలుగు డిస్‌ప్లేలు

ఎల్‌జీ 4కే మానిటర్ ఒకేసారి నాలుగు స్ర్కీన్ లను డిస్ ప్లే చేయగలదు. ఒక్కో స్ర్కీన్ సైజ్ పరిమాణం 21.5 అంగుళాలుగా ఉంటుంది. పిక్షర్ ఇన్ పిక్షర్ సపోర్ట్ ద్వారా ఒకవైపు 4కే క్వాలిటీ వీడియోలను ప్లే చేసుకుంటూనే ఫోటోలను కూడా డిస్‌ప్లే చేయవచ్చు.

7 పోర్టులతో రిచ్ టెర్మినల్

7 పోర్టులతో రిచ్ టెర్మినల్

ఈ మానిటర్‌కు సంబంధించిన వీడియో ఇన్‌పుట్ టెర్మినల్ 7 రకాల పోర్టులను కలిగి ఉంటుంది. వాటి వివరాలు.. రెండు HDMI 2.0 ఇన్‌పుట్స్, రెండు HDMI 1.4 ఇన్‌పుట్స్, ఒక డిస్‌ప్లే పోర్ట్ టెర్మినల్, ఒక యూఎస్ సీ-సీ పోర్ట్, RS-232C టెర్మినల్.

నాలుగు డివైస్‌లను మానిటర్‌కు కనెక్ట్ చేసుకుని...

నాలుగు డివైస్‌లను మానిటర్‌కు కనెక్ట్ చేసుకుని...

ఈ పోర్ట్ సహాయంలో ఒకేసారి నాలుగు డివైస్‌లను మానిటర్‌కు కనెక్ట్ చేసుకుని నాలుగు రకాల స్ర్కీన్‌లను చూడొచ్చు. రెండు స్టాండర్డ్ యూఎస్బీ 3.0 పోర్ట్స్ ద్వారా రెండు కంప్యూటర్లను సింగిల్ మౌస్ ఇంకా కీబోర్డ్ తో కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

 ఆటోమెటిక్ స్ర్కీన్ స్ప్లిట్

ఆటోమెటిక్ స్ర్కీన్ స్ప్లిట్

"OnScreen Control" పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను ఎల్‌జీ ఈ మానిటర్‌లో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా స్ర్కీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇంకా పిక్షర్ మోడ్‌తో పాటు ఆపరేటింగ్ సిస్టంలోని గేమ్ ఫంక్షన్స్‌ను మార్చుకునే వీలుంటుంది.

శక్తివంతమైన స్పీకర్ అవుట్ పుట్

శక్తివంతమైన స్పీకర్ అవుట్ పుట్

10 W + 10 W హై అవుట్ పుట్ స్పీకర్లను ఈ మానిటర్‌లో ఎల్ జీ పొందుపరిచింది. రిచ్ బేస్ ఫీచర్ ఈ స్పీకర్లుక ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. శక్తివంతమైన స్టీరియోస్కోపిక్ సౌండ్ ను ఈ స్పీకర్స్ ను ఆస్వాదించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మానిటర్ ధర 745 డాలర్ల వరకు ఉండొచ్చని సమాచారం.

Best Mobiles in India

English summary
LG 4K monitor shows four displays in one 42.5-inch Panel. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X