Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఫోన్ ధరకే టాబ్లెట్!

Updated: Monday, August 20, 2012, 16:31 [IST]

tablet pc makers in india

ఫోన్ల మార్కెట్లో పోటీ ఎక్కువై మార్జిన్లు క్షీణిస్తున్న నేపథ్యంలో దేశీయ మొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా టాబ్లెట్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్న టాబ్లెట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరుణంలో ఈ మార్కెట్‌ను క్యాప్చర్ చేయాలని కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఒలైవ్ వంటి కంపెనీలు ఇప్పటికే టాబ్లెట్లను విడుదల చేశాయి.

ఈ కంపెనీలు తెచ్చిన టాబ్లెట్ల ధరలు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల మధ్య ఉన్నాయి. టాబ్లెట్ల సగటు ధర హ్యాండ్ సెట్లు, స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నందు వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఇదే కంపెనీల లాభాలను పెంచుకోవడానికి దోహదపడుతోంది. కేవలం టాబ్లెట్లను తీసుకురావడమే కాకుండా విభిన్న రకాల కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కంటెంట్‌ను కూడా డెవలప్ చేయాలని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, సాధారణ వినియోగదారుల అవసరాలను గుర్తించి కంటెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

Story first published:  Monday, August 20, 2012, 16:30 [IST]
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu

Also Read

Opinion Poll