64-Bit, 32-Bit ఆపరేటింగ్ సిస్టమ్స్ మధ్య తేడాలేంటి..?

ఇవే ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న వేరువేరు ప్రాసెసింగ్ వ్యవస్థలు..

|

కంప్యూటర్ పరిభాషలో 32-Bit,64-Bit అనేవి ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న వేరువేరు ప్రాసెసింగ్ వ్యవస్థలుగా చెప్పుకోవచ్చు. 32-Bit ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉన్న కంప్యూటర్‌లు 4,294,967,296 వాల్యూలను కలిగి ఉంటాయి. ఇదే సమయంలో 64-Bit ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉన్న కంప్యూటర్‌లు 18.4 క్విన్టిలియన్ వాల్యూలను సపోర్ట్ చేస్తాయి.

వీటిని ఎలా రిఫర్ చేస్తారు..?

వీటిని ఎలా రిఫర్ చేస్తారు..?

32-Bit హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్‌లను x86, x86-32 అని రిఫర్ చేయటం జరుగుతుంది. 32-Bit హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్‌లను x64, x86-64 అని రిఫర్ చేయటం జరుగుతుంది.

డేటాను పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి

డేటాను పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి

32- Bit ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే సిస్టమ్స్ డేటాను 32-Bit పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి. 64-Bit ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే సిస్టమ్స్ డేటాను 64-Bit పీసెస్‌గా ఉపయోగించుకుంటాయి.

కొత్త ప్రాసెసర్‌లు 64-bit ఆర్కిటెక్షర్‌తో వస్తున్నాయి..

కొత్త ప్రాసెసర్‌లు 64-bit ఆర్కిటెక్షర్‌తో వస్తున్నాయి..

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు కొత్త ప్రాసెసర్‌లు 64-bit ఆర్కిటెక్షర్‌తో పాటు 64-bit ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విధమైన ప్రాసెసర్లు 32-Bit ఆపరేటింగ్ సిస్టంలను కూడా పూర్తిగా సపోర్ట్ చేయగలవు.

64-bit అలానే 32-Bit ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి
 

64-bit అలానే 32-Bit ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి

మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు విడుదల చేసిన విండోస్ 10, విండోస్ 8, విండోస్ 7, విండోస్ విస్టా ఇలా ఎడిషన్స్ 64-bit అలానే 32-Bit ఫార్మాట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క విండోస్ ఎక్స్‌పి ప్రొఫెషనల్ మాత్రమే 64-bit ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఎంత వరకు ర్యామ్‌ను ఉపయోగించుకుంటాయ్..?

ఎంత వరకు ర్యామ్‌ను ఉపయోగించుకుంటాయ్..?

32-Bit ఆపరేటింగ్ సిస్టం కేవలం 4జీబి వరకు ర్యామ్‌ను మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది. ఇదే సమయంలో 64-bit ఆపరేటింగ్ సిస్టం 16 exabytes వరకు ర్యామ్‌ను ఉపయోగించుకోగలుగుతుంది. మీరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నట్లయితే ర్యామ్ లిమిటేషన్‌ను 2 terabytes వరకు పెంచుకోవచ్చు.

2005 నుంచి 64-bit చిప్స్

2005 నుంచి 64-bit చిప్స్

2000 సంవత్సరంలో 64-bit కంప్యూటింగ్‌ను చాలా ఖరీదైన విషయంగా పరిగణించాల్సి వచ్చేది.2005 నుంచి 64-bit చిప్స్ అందుబాటులోకి రావటం మొదలుపెట్టాయి.

32-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ ఉంటాయి

32-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ ఉంటాయి

32-bit కంప్యూటింగ్‌తో 64-bit కంప్యూటింగ్‌ను పోల్చి చూసినట్లయితే 32-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. దీంతో మీరు కొంత మేరకే కంప్యూటింగ్‌ను ఆస్వాదించగలుగుతారు. 64-bit కంప్యూటింగ్‌లో లిమిటేషన్స్ ఉండవు.

{image_gallery1}

Best Mobiles in India

English summary
What Is the Difference Between 64-Bit and 32-Bit Operating Systems?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X