మార్కెట్లోకి సామ్‌సంగ్ గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్, ఆసక్తికర విషయాలు..

గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలయ్యింది.

|

2016లో ప్రపంచానికి పరిచయమైన సామ్‌సంగ్ గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలయ్యింది. మంగళవారం మార్కెట్లో లాంచ్ అయిన గేర్ ఎస్3 రెండు వేరియంట్‌లలో (క్లాసిక్, ఫ్రాంటైర్) అందుబాటులో ఉంటుంది. ధర రూ.28,500. ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 18 నుంచి డెలివరీ ప్రాసెస్ మొదలవుతుంది.

LTE నెట్‌వర్క్‌ సపోర్ట్...

LTE నెట్‌వర్క్‌ సపోర్ట్...

టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ స్మార్ట్ వాచీలలో కనెక్టువిటీ ఫీచర్లు వేరు వేరుగా ఉంటాయి. క్లాసిక్ వేరియంట్ గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్ బ్లుటూత్ ఇంకా వై-ఫైలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో గేర్ ఎస్3 ఫ్రాంటైర్ వేరియంట్ బ్లుటూత్, వై-ఫైలతో పాటు LTE నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ వాచీలు వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్.

 ‘Always On' డిస్‌ప్లే

‘Always On' డిస్‌ప్లే

1.3 ఇంచ్ సూపర్ అమోల్డ్ ఫుల్ సర్క్యులర్ డిస్‌ప్లే (రిసల్యూషన్360× 360పిక్సల్స్, 278 డీపీఐ), డిస్‌ప్లేకు రక్షణ కవచంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ SR+ ప్రోటక్షన్‌ను సామ్‌సంగ్ ఏర్పాటు చేసింది. ‘Always On' ఫీచర్ డిస్‌ప్లేను ఎప్పుడు వేకువగానే ఉంచుతుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ
 

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ

1GHz డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ వాచీలో 768MB ర్యామ్ అలానే 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌లు ఉంటాయి. వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా పొందుపరిచరిన 380mAh బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై నాలుగు రోజుల వరకు బ్యాకప్‌ను సమకూర్చగలదని సామ్‌సంగ్ చెబుతోంది. మ్యాపింగ్ వివరాలను తెలుసుకునేందు GPS, మొబైల్ పేమెంట్స్ కోసం NFC వంటి సదుపాయాలు ఈ వాచీలో ఉన్నాయి.

స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక..

స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక..

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. యాపిల్, సోనీ, సామ్‌సంగ్, మోటరోలా వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో అదిస్తున్నాయి. ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Gear S3 smartwatch launched in India, priced at Rs 28,500. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X