మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

By Sivanjaneyulu
|

ప్రపంచంలో అతి పెద్ద యాప్ స్టోర్ ఏదైనా ఉందంటే అది గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్థి చేసిన ఈ యాప్ స్టోర్‌లో లక్షల సంఖ్యలో యాప్స్, గేమ్స్, బుక్స్, మూవీస్ కొలువుతీరి ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు తమతమ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లలోకి లాగినై వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

కొన్ని సందర్భాల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే సమస్యలు విసుగుపుట్టిస్తుంటాయి. ముఖ్యంగా యాప్‌ను డౌన్‌లోడ్ లేదా కొనుగోలు చేస్తున్న సమయంలో తలత్తే ఎర్రర్స్ చికాకుపుట్టిస్తాయి. వాస్తవానికి ఇవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలేమి కావు. కొన్ని సింపుల్ ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా వీటిని సలువుగా పరిష్కరించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే 5 సాధారణ సమస్యలు వాటిని పరిష్కరించుకునేందుకు మార్గాలను ఇప్పుడు చర్చించుకుందాం...

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

DF-BPA-09 'Error Processing Purchase'


DF-BPA-09.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో వస్తుంటుంది. ఈ సమస్య ఇక మీదట మీకు ఎదురైనట్లయితే డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్ వర్క్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

 

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

Code 194...ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా మీరు ప్లే స్టోర్ నుంచి గేమ్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించినపుడు సంభవిస్తుంటుంది. ఈ సమస్య మీకు ఎదురైనపుడు గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌కు సంబంధించిన క్యాచీ డేటాను క్లియర్ చేసినట్లయతే సమస్య పరిష్కారమవుతుంది.

క్యాచీని క్లియర్ చేసే క్రమంలో డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేస్తే సరి.

 

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

Code 495... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ప్లే స్టోర్ నుంచి యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌‍డేట్ చేస్తున్న సమయంలో వస్తుంటుంది. ఈ ఎర్రర్‌ను ఫిక్స్ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే స్టోర్ డేటాను డిలీట్ చేస్తే సరి.

సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేయండి.

 

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

Code 941.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ఓ యాప్ లేదా గేమ్‌ను అప్‌డేట్ చేసే సమయంలో తలెత్తే ఆటంకం కారణంగా ఏర్పడుతుంది. ప్లే స్టోర్ యాప్‌కు సంబంధించి క్యాచీతో పాటు డేటాను క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

 

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

మీ గూగుల్ ప్లే స్టోర్‌ అకౌంట్‌లో సమస్యలా..?

కోడ్ 498... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్‌ను డౌన్‌లోడింగ్ సమయంలో తలెత్తే ఆటంకాల కారణంగా ఫేస్ చేయవల్సి ఉంటుంది. డివైస్‌లోని క్యాచీతో పాటు పనికిరాని అప్లికేషన్‌లను డిలీట్ చేయండి. ఆ తరువాత రికవరీ మోడ్‌లో ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి సమస్య పరిష్కారమవుతుంది.

 

Best Mobiles in India

English summary
5 Most Common Google Play Store Errors And How To Fix Them [Tutorial]. The Google Play Store is the largest app store for Android apps and games, which acts as a giant hotspot for all the Android users.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X