ఫోన్‌లో పోర్న్ వెబ్‌‌సైట్‌లు చూసే ముందు ఇవి మరచిపోకండి

మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

By Gizbot Bureau
|

మొబైల్ ఇంటర్నెట్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటకి టెక్నికల్ పరంగా కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

Read More : 35 లక్షల పాటలు ఫ్రీగా వినే అవకాశం!

రాన్సమ్‌వేర్

రాన్సమ్‌వేర్

స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లే. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను పూర్తిగా లాక్ చేసేస్తుంది.

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చైల్డ్ పోర్నోగ్రఫీ..
 

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

వ్యక్తిగత డేటా గల్లంతు..

వ్యక్తిగత డేటా గల్లంతు..

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‌

అవగాహన రాహిత్యంతో..

అవగాహన రాహిత్యంతో..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట.

వాటిని ఎరవేస్తారు..

వాటిని ఎరవేస్తారు..

అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతన్నారు. వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఎంత డేటా ఖర్చవుతుంది..?

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని ఆసక్తికర వివరాలు

కొన్ని ఆసక్తికర వివరాలు

బ్యాన్‌లు విధించినప్పటికి, నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికి భారత్‌లో బూతు చిత్రాలను వీక్షించే వారి సంఖ్య అంతకంతకు పెరగిపోతూనే ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు అందరికి అందుబాటులో ఉండటంతో నీలి చిత్రాలు వీక్షణ మరింత ముదిరిపోయింది. ప్రముఖ నీలి చిత్రాల వెబ్‌సైట్ పోర్న్‌హబ్ నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర వివరాలు తేటతెల్లమయ్యాయి.

 భారత్ మూడో స్థానంలో..

భారత్ మూడో స్థానంలో..

పోర్న్‌హబ్ ద్వారా పోర్న్‌ను అత్యధికంగా వీక్షిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.మొదటి రెండు స్థానంలో యూఎస్, యూకేలు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా..

ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా..

మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా పోర్న్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య 71 శాతం, యాపిల్ ఫోన్‌ల ద్వారా వీక్షిస్తున్న వారి సంఖ్య 6 శాతం, ఇతర మొబైల్ ఫోన్ ల ద్వారా వీక్షిస్తోన్న వారిక సంఖ్య 23 శాతంగా ఉంది.

 2015లో 35శాతానికి..

2015లో 35శాతానికి..

2010లో భారత్ నుంచి వచ్చే పోర్న్‌హబ్ డెస్క్‌టాప్ ట్రాఫిక్ 88 శాతం కాగా, 2015లో 35శాతానికి పడిపోయింది.అంటే దాదాపు 65 శాతం ట్రాఫిక్ మొబైల్ ఫోన్‌ల ద్వారా వస్తున్నదే.32 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుంచి 31 శాతం ఐఓఎస్ ఆధారిత డివైస్‌ల నుంచి ట్రాఫిక్ వస్తోందని సదరు సైట్ వెల్లడించింది.

భారత్ లో 26 శాతం మొబైల్ ట్రాఫిక్..

భారత్ లో 26 శాతం మొబైల్ ట్రాఫిక్..

పోర్న్‌హబ్ చెబుతున్న వివరాల ప్రకారం భారత్ లో 26 శాతం మొబైల్ ట్రాఫిక్ మహిళా వ్యూవర్స్ నుంచి వస్తోందట.భారత్‌లో పోర్న్ వీక్షిస్తోన్న 36 శాతం యూజర్లు 18 నుంచి 24 వయసు లోపు వారేనట.పోర్న్ చిత్రాలను వీక్షించేందుకు ఐఓఎస్ యూజర్లు సగటున 8 నిమిషాల 40 సెకన్ల సమాయాన్ని కేటాయిస్తున్నారట.పోర్న్ చిత్రాలను వీక్షించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం 10 నిమిషాల 6 సెకన్లను కేటాయిస్తున్నట్లు పోర్న్‌హబ్ తెలిపింది.

Best Mobiles in India

English summary
5 reasons why you should not watch Adult Content on your smartphone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X