ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ రీఫ్రెష్ అవ్వాలంటే..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని పెంచుకునేందుకు ముఖ్యమైన సూచనలు.

|

స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి... ఫోన్‌లో పేరుకుపోయిన పనికిరాని యాప్స్ ఇంకా విడ్జెట్స్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

Read More : ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?

 క్యాచీ ఫైల్స్ క్లియర్ చేయండి

క్యాచీ ఫైల్స్ క్లియర్ చేయండి

క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కు సంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి.

నిరుపయోగంగా ఉన్న యాప్స్ క్లియర్ చేసుకోండి

నిరుపయోగంగా ఉన్న యాప్స్ క్లియర్ చేసుకోండి

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను తొలగించిటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు.

విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా...
 

విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా...

హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది.

 హెవీ గ్రాఫికల్ గేమ్స్...

హెవీ గ్రాఫికల్ గేమ్స్...

Real Racing, Asphalt 8 వంటి హెవీ గ్రాఫికల్ గేమ్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి.

స్పీడ్ బూస్టర్ యాప్స్...

స్పీడ్ బూస్టర్ యాప్స్...

Clean Master, CCleaner, Du Speed Booster వంటి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ వేగాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
5 Ways to Speed Up Your Android Phone in Under 5 Minutes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X