భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ..? ( స్టెప్ బై స్టెప్ )

మీకోసం భీమ్ యాప్ ఎలా వాడాలన్న దానిపై స్టెప్ బై స్టెప్ గా అన్ని వివరాలను అందిస్తున్నాం.

By Hazarath
|

మీరు భీమ్ యాప్ వాడుతున్నారా..అయితే అది ఎలా వాడాలో తెలియడం లేదా..అయితే మీకోసం భీమ్ యాప్ ఎలా వాడాలన్న దానిపై స్టెప్ బై స్టెప్ గా అన్ని వివరాలను అందిస్తున్నాం. వీటిని ఫాలో అయితే మీరు మీ భీమ్ యాప్ ద్వారా ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవడం గాని అలాగే డబ్బులు రిక్వెస్ట్ పెట్టడం గాని చేయవచ్చు. ప్రాసెస్ ఎలాగో చూద్దాం.

 

కొత్త హంగులతో భీమ్ యాప్

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ట్‌లో కెళ్లి భీమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఐవోఎస్ యూజర్లకి అందుబాటులో లేదు.

స్టెప్ 2

స్టెప్ 2

అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత వెరిఫై ఫోన్ నంబర్ అడుగుతుంది. అది ఎసెమ్మెస్ రూపంలో వస్తుంది. అది పూర్తి కాగానే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు వస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

వెరిఫికేషన్ ఫూర్తి కాగానే మీకు 4 డిజిట్ పాస్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

 స్టెప్ 4
 

స్టెప్ 4

పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మీరు ఏ బ్యాంకు నుంచి లావాదేవీలు జరపాలనుకుంటున్నారో ఆ బ్యాంకును సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. బ్యాంకును సెలక్ట్ చేసుకోగానే మీ ఫోన్ నంబర్ ద్వారా వివరాలను ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా మీరు అన్ని రకాల ట్రాన్సిక్షన్స్ చేసుకోవచ్చు.

స్టెప్ 5

స్టెప్ 5

యాప్‌లో మూడు రకాల ఆప్సన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో సెండ్, రిక్వెస్ట్, స్కాన్ పే.. ఈ మూడు రకాల ఆప్సన్లలో మీకు కావాల్సినది సెలక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 6

స్టెప్ 6

సెండ్ ఆప్సన్‌లో మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వారి ఫోన్ నంబర్ అలాగే ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అమౌంట్ అడుగుతుంది. దీంతో పాటు మీరు ముందు ఎంటర్ చేసిన పిన్ అడుగుతుంది. అవి ఎంటర్ చేయగానే అమౌంట్ ట్రాన్సిక్షన్ జరుగుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

అలాగే మీరు ఎవరికైనా అమౌంట్ రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ ఆప్సన్‌లో కెళ్లి మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఆలోమేటిగ్గా వారికి మీ రిక్వెస్ట్ చేరుతుంది. అయితే మీరు ఈ మూడు ఆప్సన్లలో ఏది యూజ్ చేయాలన్నా అవతలి వారు కూడా భీమ్ యాప్ లో లాగిన్ అయి ఉండాలి.

 స్టెప్ 8

స్టెప్ 8

మూడో ఆప్సన్ బార్ కోడ్ స్కానర్. దీని ద్వారా కూడా అమౌంట్ పంపుకునే వీలు ఉంటుంది. మొబైల్లో గాని , ట్యాబ్లెట్‌లో గాని ఈ యాప్ ఉన్న వారి నుండి యాప్ ఓపెన్ స్కాన్ కోడ్ తీసుకుంటే మీరు ఆటోమేటిగ్గా డబ్బులు పంపుకోవచ్చు.

Best Mobiles in India

English summary
A step-by-step guide on how to use BHIM app read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X