ఆధార్ కార్డులో తప్పులా..? మీరే సరిచేసుకోండి

మీ ఆధార్ కార్డును మీరే ఎడిట్ చేసుకోవచ్చు.

|

ఇప్పుడు మీరే, మీ ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేయవచ్చు. మీరు ఇంతకుముందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ సెంటర్లకు తిరగనవసరం లేదు. కేవలం మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు. నెట్ సదుపాయం ఉంటే మనమే ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మన వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

ఆధార్ కార్డులో తప్పులా..? మీరే సరిచేసుకోండి

మీ ఫోన్ స్ర్కీన్ పగిలిపోయిందా? టచ్ పనిచేయడం లేదా? మరి, లాక్ ఎలా తీయాలి

https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. అక్కడ మీకు సెండ్ ఓటీపీ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం.

దూసుకొస్తున్న నోకియా, యాపిల్ సామ్‌సంగ్‌లకు దడ పుట్టించేలా

ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.

ఆధార్ కార్డులో తప్పులా..? మీరే సరిచేసుకోండి

కొత్త వివరాలు ఆధార్‌లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status యూఆర్ఎల్ పేజీలోకి వెళ్లండి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఇవే (టాప్-20)

ఇందుకోసం https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి. ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

Best Mobiles in India

English summary
Aadhaar Card Corrections Online Update Name Address phone number simple process. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X