మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

|

మీ ఆధార్ కార్డులో తప్పులన్నాయా..? వాటిని సరిదిద్దు కోవటం ఇప్పుడు చాలా సులభం. మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

Read More : ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

 స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఈ ఆధార్ అప్‌డేట్ లింక్‌లోకి వెళ్లండి. https://resident.uidai.net.in/update-data

 స్టెప్ 2

స్టెప్ 2

ఆ పేజీలో కిపించే Update Aadhaar Data బటన్ పై క్లిక్ చేయండి.

 స్టెప్ 3

స్టెప్ 3

Update Aadhaar Data బటన్ క్లిక్ చేసిన తరువాత మీ ఈ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4
 

స్టెప్ 4

ఆ పేజీలో మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను Text Verification బాక్సులో ఎంటర్ చేయండి. అనంతరం send OTP బటన్ పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినట్లయితే Data Update Request పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు.

స్టెప్ 5

స్టెప్ 5

Data Update Request పేజీలోకి వెళ్లిన తరువాత మీరు మార్పు చేయాలనకుంటున్న వివరాలకు సంబంధించిన బాక్సులను మార్క్ చేసి పేజీ క్రింద కనిపించే "Submit" బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొత్త పేజీలోకి రిడైరెక్ట్ కాబడతారు. ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.

స్టెప్ 6

స్టెప్ 6

చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

స్టెప్ 8

స్టెప్ 8

కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

స్టెప్ 9

స్టెప్ 9

ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు. చిరునామా.. చిరునామా 1: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10, చింద్వారా, మధ్య ప్రదేశ్ - 480001, భారతదేశం. చిరునామా 2: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ No.99, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034, భారతదేశం.

స్టెప్ 10

స్టెప్ 10

కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్‌డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

Best Mobiles in India

English summary
Aadhar Card Correction, Update your Aadhar Data in Simple Ways. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X