యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

|

యూట్యూబ్.. ఇదో వీడియోల ప్రపంచం. అంశం ఎలాంటిదైనా సరే, ఇక్కడ టక్కున సొల్యూషన్ దొరికేస్తుంది. మార్కెట్లోకి కొత్త‌కొత్త వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌‍లు పుట్టుకొస్తున్నప్పటికి యూట్యూబ్ హవాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రకటనల రూపంలో గూగుల్‌కు కాసలు వర్షం కురిపిస్తున్న యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వీరిని మెప్పించేందుకు వేల సంఖ్యలో వీడియోలు ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంటాయి. మీ యూట్యూబ్ వినియోగాన్ని మరింత సులభతరం చేసుకునేందుకు ముఖ్యమైన టిప్స్ ఇంకా ట్రిక్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

20 మెగా పిక్సల్ కెమెరాతో టాప్ లేపుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

loop పేరుతో సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ కొత్తగా యాడ్ చేసింది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా వీడియో దానంతటకదే రిపీట్ అవుతుంటుంది. loop ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలంటే ముందుగా వీడియోను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వీడియో పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసినట్లయితే, వివిధ ఆప్షన్‌లతో కూడిన మెనూ ప్రత్యక్షమవుతుంది. వాటిలో ‘Loop' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

 

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్ వీడియోలను ప్లే చేయటానికి ‘మౌస్' మాత్రమే వాడాలన్న నిబంధనేమి లేదు. కీబోర్డ్ ద్వారా కూడా వీడియోలను ప్లే చేయవచ్చు. యూట్యూబ్ కంటెంట్‌ను కీబోర్డ్ ద్వారా ప్లే చేసేందుకు గూగుల్ ఆఫర్ చేస్తున్న keyboard-only navigationను పొందాలంటే ముందుగా యూట్యూబ్‌ను ఈ యూఆర్ఎల్‌ తో ‘www.youtube.com/leanback' ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కీబోర్డ్‌తో నావిగేట్ చేయగలిగే యూట్యూబ్ పేజ్ కనిపిస్తుంది. కీబోర్డ్ ద్వారా యూట్యూబ్‌ను ఆపరేట్ చేసుకునేందుకు navigation బటన్‌లతో పాటు Enterను ఉపయోగిస్తే సరిపోతుంది.

 

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి
 

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉన్నప్పుడు వీడియోలు ప్లే అవటానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ‘https://www.youtube.com/account_playback' లింక్ లోకి వెళ్లి ‘I have a slow internet connection. Never play higher-quality video.' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ డేటాను బట్టి తక్కువ రిసల్యూషన్ లో వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ మీరు హైడెఫినిషన్ రిసల్యూషన్ క్వాలిటీలో వీడియోలను ప్లే చేయాలనుకుంటున్నట్లయితే అనేక Extensions అందుబాటులో ఉన్నాయి.

 

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను అందిస్తుంది. యూట్యూబ్ కిడ్స్‌గా పిలవబడతున్న ఈ యాప్‌ను కేవలం పిల్లలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసింది. విద్య, విజ్ఞానం ఇంకా వినోదాలను అందించే వీడియోలను మాత్రమే యూట్యూబ్ ఈ వర్షన్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో ద్వారా వీడియోలను పిల్లలు ఎంత సేపు వీక్షంచాలో కూడా తల్లిదండ్రులు నిర్ధేశించవచ్చు.

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

యూట్యూబ్‌లో, వీడియోలను మరింత సులువుగా వెతకాలనుకుంటే YouTube IT అనే యాడ్‌ఆన్‌ను మీ బ్రౌజర్‌కు జత చేయండి. యాడ్‌ఆన్‌ను విజయంవంతంగా మీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసిన తరువాత మీరు వెతకాల్సిన వీడియోకు సంబంధించిన టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకుని రైట్ క్లిక్ మెనూలోని యూట్యూబ్ ఐటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. వెంటనే యూట్యూబ్ ఓపెన్ అవ్వటంతో పాటు మీకు కావల్సిన అంశానికి సబంధించిన వీడియోలు ప్లే అవటం మొదలవుతాయి.

Best Mobiles in India

English summary
Best Tips and Tricks For YouTube users . Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X