మిమ్మల్ని కొత్తగా చూపించే ఫేస్‌బుక్ టిప్స్

ఫేస్‌బుక్ కొత్తగా, మరింత క్రియేటివ్‌గా...

|

ఫేస్‌బుక్ యాప్‌ను రోజుకు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ దగ్గర నుంచి హాటెస్ట్ గేమ్స్ వరకు, వీడియో కాలింగ్ దగ్గర నుంచి ఆడియో కాలింగ్ వరకు చాటింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్ని కార్యకలాపాలాను ఫేస్‌బుక్ ద్వారానే ఈ కాలం యువత నిర్వహించుకువటం జరుగుతోంది. రోజువారీ ఫేస్‌బుక్ వినియోగంలో భాగంగా మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునేందుకు గాను కొన్ని సులువైన టిప్స్ ఇంకా ట్రిక్స్‌ మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

 

 మీ ప్రొఫైల్ పిక్‌ను యానిమేటెడ్ GIFలా మార్చేసుకోండి

మీ ప్రొఫైల్ పిక్‌ను యానిమేటెడ్ GIFలా మార్చేసుకోండి

ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో మీ ఫ్రొపైల్ పిక్షర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత "Take a New Profile Video" ఆప్షన్‌లోకి వెళ్లి మీకు సంబంధించిన చిన్న వీడియో లూప్‌ను అప్‌లోడ్ చేయండి. ఇప్పడు క్రియేట్ అయ్యే ప్రొఫైల్ పిక్షర్ యానిమేటెడ్ GIFలా అనిపిస్తుంది.

వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..? ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ను కొందరు ఇష్టపడుతుంటే మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు.

ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చాలి...
 

ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చాలి...

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత Screen కుడివైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

మొబైల్ వర్షన్‌లో ఈ ఫీచర్‌ను మార్చాలంటే..?

మొబైల్ వర్షన్‌లో ఈ ఫీచర్‌ను మార్చాలంటే..?

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే నచ్చిన న్యూస్‌ఫీడ్  కనిపించాలా..?

యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే నచ్చిన న్యూస్‌ఫీడ్ కనిపించాలా..?

మీ ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే మీకు నచ్చిన వ్యక్తులు లేదా పేజీలకు సంబంధించిన న్యూస్ ఫీడ్ ముందుగా కనిపించాలా..? అయితే యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి "More" టాబ్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే "News Feed Preferences" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన వ్యక్తులు లేదా పేజీలను మార్క్ చేసుకున్నట్లయితే వారికి సంబంధించి న్యూస్ ఫీడ్స్ మీకు ముందుగా కనిపిస్తాయి.

మీరు షేర్ చేసే పోస్టులు కొద్ది మందికి మాత్రమే వెళ్లాలా..?

మీరు షేర్ చేసే పోస్టులు కొద్ది మందికి మాత్రమే వెళ్లాలా..?

అయితే మొబైల్ ప్రైవసీలోని "Edit Privacy" ఆప్షన్స్ లోకి వెళ్లి మీ పోస్ట్ ఎవరెవరికి షేర్ అవ్వాలో వాళ్లకు మాత్రమే పంపుకోవచ్చు.

 మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ మీ అకౌంట్‌లో ఉన్న వారికి మాత్రమే కనిపించాలా..?

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ మీ అకౌంట్‌లో ఉన్న వారికి మాత్రమే కనిపించాలా..?

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ మీ మిత్రులకు ఒకరకంగా, వేరే వాళ్లకి మరొకరకంగా కనిపించాలా అయితే Facebook desktop websiteలో లాగిన్ అయిన వెంటనే ప్రొఫైల్ విభాగంలో కనపించే ellipsis (మూడు డాట్స్) పై క్లిక్ చేయండి. ఇప్పుడు View as ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఏలా కనిపించాలన్నది సెట్ చేసుకోవచ్చు.

 మీ ఫేస్‌బుక్  ఫ్రెండ్స్ లిస్ట్ ఇతరలకు కనిపించకూడదా.?

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఇతరలకు కనిపించకూడదా.?

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఇతరలకు కనిపించకుండా చేయాలంటే ముందుగా Facebook desktop websiteలో లాగిన్ అవ్వండి. ఆ తరువాత ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఓపెన్ చేసి కుడి వైపున కనిపించే "Manage" pen icon ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు "Edit Privacy" ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు.

 మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇతరులు వాడుతున్నారని అనుమానంగా ఉందా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇతరులు వాడుతున్నారని అనుమానంగా ఉందా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొకరు వాడుతున్నారని మీకు అనుమానంగా ఉన్నట్లయితే క్రాస్ చెక్ చేసుకునేందుకు ముందు ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపు‌న కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి.

 మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇతరులు వాడుతున్నారని అనుమానంగా ఉందా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇతరులు వాడుతున్నారని అనుమానంగా ఉందా..?

సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి. వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Facebook tips and tricks everyone should know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X