మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్ కంప్యూటర్‌లో కనిపించాలా..?

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ స్ర్కీన్ పై కనిపిస్తుంది.

|

యాపిల్ సిరి, ఓకే గూగుల్ వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లకు పోటీగా మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చిన వాయిస్ కమాండింగ్ ఫీచర్ Cortana అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇటీవల లాంచ్ అయిన విండోస్ 10 అప్‌డేట్‌తో విండోస్ యూజర్లు తమ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను కంప్యూటర్‌లో చూడగలుగుతున్నారు.

 

ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది

ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది

ఇలా చూడాలంటే ముందుగా incoming call notification featureను మీ విండోస్ 10 డివైస్‌లో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

ప్రతి నోటిఫికేషన్ ల్యాప్‌టాప్ స్ర్కీన్ పై కనిపిస్తుంది

ప్రతి నోటిఫికేషన్ ల్యాప్‌టాప్ స్ర్కీన్ పై కనిపిస్తుంది

ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. ఇన్‌కమ్మింగ్ కాల్ నోటిఫికేషన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకునే ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా Cortana appను గూగుల్ ప్ల స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాలేషన్ పూర్తి చేయండి.

స్టెప్ 2
 

స్టెప్ 2

యాప్ ఫోన్‌లో లాంచ్ అయిన తరువాత hamburger ఐకాన్ పై టాప్ చేసి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లండి. సెట్టింగ్స్ విభాగంలో Cortana Settingsను ఓపెన్ చెయ్యండి.

స్టెప్ 3

స్టెప్ 3

సింక్ నోటిఫికేషన్స్ పై టాప్ ఇచ్చి మిస్సుడ్ కాల్, ఇన్‌కమ్మింగ్ కాల్, ఇన్‌కమ్మింగ్ మెసేజ్, లో బ్యాటరీ ఇంకా యాప్ నోటిఫికేషన్‌లను టర్న్ ఆన్ చేసుకోండి.

స్టెప్ 4

స్టెప్ 4

మీ విండోస్ పీసీలోని Cortana యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మెనూ ఓపెన్ అయిన తరువాత డివైసెస్ మధ్య నోటిఫికేషన్స్‌ను టర్న్ ఆన్ చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Follow this steps to receive call alerts on Windows 10 PC. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X