మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

|

మోటో జీ (2014 ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం అనేది చాలా చిన్న విషయం. రీసెట్ చేయటం వల్ల మీ ఫోన్ తిరిగి ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌లోకి వచ్చేస్తుంది. రీసెట్ చేయటం వల్ల ఫోన్ లో ఏమైన సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ఫోన్ మరింత సౌకర్యవంతగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఫోన్‌ను రీసెట్ చేసే క్రమంలో డివైస్‌లోని మొత్తం యాప్స్ ఇంకా డేటా డిలీట్ అయిపోతుంది. కాబట్టి, రీసెట్‌కు ఉపక్రమించే ముందు ఫోన్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం. యూఎస్బీ కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్‌లోకి మాన్యువల్‌గా కాపీ చేసుకోవచ్చు.

Read More: స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఏం చేయాలి?

మోటో జీ (2014 ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌‌లో రీసెట్ ఆప్షన్ సెట్టింగ్స్ మెనూలో బ్యాకప్ అండ్ రీసెట్ పరిధిలో ఉంటుంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ పై టాప్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఫ్యాక్టరీ డీఫాల్ట్ సెట్టింగ్స్‌తో మీ ఫోన్ రీబూట్ అవటం ప్రారంభిస్తుంది. మోటో జీ (2014) సార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేందుకు 10 ముఖ్యమైన సూచనలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More: ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా తొలగించాలంటే..?

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ముందుగా మీ మోటో జీ (2014) సార్ట్‌ఫోన్‌ను టర్నాఫ్ చేయండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మీ ఫోన్‌కు సంబంధించి వాల్యుమ్ డౌన్ ఇంకా పవర్ బటన్‌లను ఒకేసారి మూడు సెకన్ల పాట హోల్డ్ చేసి ఉంచండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీ ఫోన్ స్ర్కీన్ పై ఫాస్ట్‌బూట్ మెనూ ఓపెన్ అవుతుంది. వాల్యుమ్ డౌన్ బటన్‌ను ఉపయోగించుకుని ‘రీకవరీ' ఆప్షన్‌ను హైలైట్ చేయండి. వాల్యుమ్ అప్ బటన్ ద్వారా ‘రీకవరీ' ఆప్షన్‌ను ఓకే చేయండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?
 
మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీ ఫోన్ పై ముందుగా మోటరోలా లోగో ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత స్ర్కీన్ పై ఆండ్రాయిడ్ రోబట్ వెనక్కి పడి ఉండటాన్ని మీరు చూస్తారు.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఇప్పుడు రికవరీ మెనూను యాక్సెస్ చేసుకునేందుకు పవర్ బటన్‌ను సెకను పాటు ప్రెస్ చేసి ఉంచి ఆ తరువాత వాల్యుమ్ అప్ బటన్ పై ప్రెస్ చేయండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఇప్పుడు రికవరీ మెను స్ర్కీన్ మీకు కనిపిస్తుంది. వాల్యుమ్ బటన్‌లను స్ర్కోల్ చేస్తూ Wipe Data/Factory Reset ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకుని, ఆ ఆఫ్షన్‌ను ఓకే చేసేందుకు పవర్ బటన్ పై ప్రెస్ చేయండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

అంతిమంగా ఈ ప్రక్రియ మొత్తాన్ని ఓకే చేసేందుకు వాల్యుమ్ బటన్‌లను స్ర్కోల్ చేస్తూ Yes ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకుని, ఓకే చేసేందుకు పవర్ బటన్ పై ప్రెస్ చేయండి.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మీ మోటో జీ (2014) ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది.

 మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయటం ఏలా..?

ఫ్యాక్టీరీ రీసెట్ ప్రకియ పూర్తియినట్లు ఓ మెసేజ్ స్కీన్ బోటమ్ భాగంలో మీకు కనిపించినట్లయితే మీ ఫోన్ ను రీబూట్ చేసుకుని యాప్స్ ఇంకా డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
A factory reset is not really a big deal, it simply returns your phone to factory settings. You will lose all of your apps and data, so you should do a full backup of important information before you continue.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X