మీ ఫోన్‌లో స్టోరేజ్ మొత్తం అయిపోయిందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు ట్రిక్స్‌..

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను స్టోరేజ్ స్పేస్ సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ తక్కువుగా ఉన్నస్మార్ట్‌ఫోన్‌లలో ఈ సమస్య ప్రధాన అవరోథంగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్యలను అధిగమించేందుకు పలు ట్రిక్స్‌ను ఇక్కడ సూచించటం జరుగుతోంది.

 

టిప్ 1

టిప్ 1

ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయటానికి Settings > Apps > Downloaded Appsలోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని "move to SD card" పై టాప్ చేయండి.

టిప్ 2

టిప్ 2

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

టిప్ 3

టిప్ 3

ఫోన్ యాప్స్‌కు సంబంధించి క్యాచీని తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఆదా అవుతుంది. క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలవు.

టిప్ 4
 

టిప్ 4

ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం వ్వారా ఇంటర్నల్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.

టిప్ 5

టిప్ 5

ఫోన్ ఇంటర్నల్ మెమురీలో స్టోర్ అయిన ఫోటోలు, వీడియోలను ఎస్డీ కార్డులోకి మూవ్ చేయటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.

టిప్ 6

టిప్ 6

ఫోన్‌లోని డేటాను క్లౌడ్ అకౌంట్‌లలో స్టోర్ చేసుకోవటం ద్వారా మెమరీ ఆదా అవుతుంది.

టిప్ 7

టిప్ 7

ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ మెమరీ ఆదా అవుతుంది.settings > Privacy and Security > Clear Cache and History

Best Mobiles in India

English summary
How to get more storage in Android Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X