స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయటం ఎలా..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ను పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ చేయవల్సి వస్తే...

చాలా వరకు మార్కెట్లో లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో మైక్రోఎస్డీ స్లాట్ లను మనం చూస్తున్నాం. ఇంటర్నల్ expansion కార్డ్‌స్లాట్‌లను కలిగి ఉన్న ఫోన్‌లలో దాదాపుగా స్టోరేజ్ సమస్యలు తొలగినట్లే!. అనుకోని పరిస్థితుల్లో, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ను పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ చేయవల్సి వస్తే, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి.

Read More : 2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పెన్‌డ్రైవ్‌‌కు కనెక్ట్ అవ్వాలంటే తప్పనసరిగా On-The-Go (OTG) ఫీచర్‌ను కలిగి ఉండాలి. ఒవవేళ ఈ సదుపాయం మీ ఫోన్‌లో లేకపోయినట్లయితే USB OTG checker యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పటికి కూడా మీ ఫోన్ OTG సపోర్టును పొందలేక పోయినట్లయితే తప్పనిసరిగా ఫోన్‌ను రూట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 2

మీ డివైస్కు USB OTG సపోర్ట్ లభించిన వెంటనే ఓ OTG కేబుల్‌ను కొనుగోలు చేయండి.

స్టెప్ 3

ఇప్పుడు OTG కేబుల్ ఒకవైపు భాగాన్ని మీ ఫోన్‌కు కనెక్ట్ చేసి మరొక భాగాన్ని పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ చేయండి.

స్టెప్ 4

పెన్‌డ్రైవ్ ఫోన్‌కు కనెక్ట్ అయిన వెంటనే యూఎస్బీ సింబల్ ఫోన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ అందని పక్షంలో ఫైల్ మేనేజర్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
How To Hook a USB Pen Drive To Your Android Smartphone: Simple Steps. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting