మీ ఫోన్‌లో Jio నెట్ స్పీడ్ తగ్గుతోందా..?

జియో అధికారిక లాంచ్ తరువాత లోడ్ మరింత పెరగటంతో ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతున్నట్లు పలువురు కస్టమర్‌లు వాపోతున్నారు. మరి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి...

|

జియో నెట్‌వర్క్ స్పీడ్ నెమ్మదిగా ఉందంటూ చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. జియో అధికారిక్ లాంచ్‌కు ముందు లైఫ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 4జీ ఇంటర్నెట్‌ను 10 నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడ్ మధ్య అందుకున్నారు.

మీ ఫోన్‌లో Jio నెట్ స్పీడ్ తగ్గుతోందా..?

జియో అధికారిక లాంచ్ తరువాత లోడ్ మరింత పెరగటంతో ఇంటర్నెట్ స్పీడ్ దారుణంగా పడిపోతున్నట్లు పలువురు కస్టమర్‌లు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. మీ ఫోన్‌లో జియో స్పీడ్ డౌన్‌లోడ్ స్పీడ్ 150 కేబీపీఎస్ నుంచి 500 కేబీపీఎస్ మధ్య ఉన్నట్లయితే, ఈ క్రింది సూచనలను పాటించండి..

Read More : రూ.499కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!

 APN సెట్టింగ్స్‌

APN సెట్టింగ్స్‌

మీ ఫోన్‌లో APN సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా జియో నెట్‌వర్క్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనపించే మొబైలప నెట్‌వర్క్స్ ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో నెట్‌వర్క్ టైప్ LTE మోడ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తరువాత Access Point Names (APN)ను సెలక్ట్ చేసుకుని అందులో కనిపించే APN protocol optionలోకి వెళ్లి Ipv4/Ipv6 అడ్రస్‌కు మారండి. ఆ తరువాత Bearer optionలోకి వెళ్లి అక్కడ కనిపించే LTE మోడ్‌ను సెలక్ట్ చేసుకుని అన్ని సెట్టింగ్స్‌ను సేవ్ చేయండి.

Speed Optimizer APK

Speed Optimizer APK

మీరు రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా, మీ ఫోన్‌లో 3G/4G Speed Optimizer APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి network speed విభాగాన్ని సెలక్ల్ చేసుకోండి. అందులో మీరు 12/28/7 - Max Speed (Low battery efficiency) optionను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. సెట్టింగ్స్ అప్లై అయిన తరువాత ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Snap VPN

Snap VPN

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Snap VPN యాప్‌ను మీ ఫోన్‌లోకి ఇ‌న్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌ను ఓపెన్ చేసినట్లయితే దేశాల జాబితాతో పాటు అక్కడి సిగ్నల్ strength వివరాలు మీకు కనిపిస్తాయి. వాటిలో బలమైన ఇంటర్నెట్ సిగ్నల్‌ను కలిగి ఉన్న దేశాన్ని సెలక్ట్ చేసుకుని connectionను establish చేయండి. మీ నెట్ వేగం కచ్చితంగా పెరుగుతుంది.

band 40

band 40

రిలయన్స్ జియో వివిధ రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో ఆఫర్ చేస్తుంది. వాటిలో band 40 ఇతర బ్యాండ్‌లతో పోలిస్తే వేగవంతమైన డేటా స్పీడ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మీ ఫోన్ ఎల్టీఈ బ్యాండ్‌ను బ్యాండ్ 40కి మార్చుకోవటం ద్వారా హై డేటా స్పీడ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

*#*#4636#*#* సీక్రెట్ కోడ్‌

*#*#4636#*#* సీక్రెట్ కోడ్‌

మీరు క్వాల్కమ్ ప్రాసెసర్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే *#*#4636#*#* సీక్రెట్ కోడ్‌ను అప్లై చేసి ఎల్టీఈ బ్యాండ్‌ను band 40కి మార్చుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ వన్‌ప్లస్ 3, షియోమీ ఎంఐ 5 వంటి క్వాల్కమ్ చిప్ డివైస్‌లలో మాత్రమే వర్క్ అవుతోంది.

 MTK Engineering tool

MTK Engineering tool

మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తోన్న కొన్ని ఫోన్‌లలో ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చేందుకు స్టెప్ 1ను అనుసరిస్తే సరిపోతుంది. మరికొన్ని ఫోన్ లలో మాత్రం MTK Engineering toolను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

APN Settings

APN Settings

ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చిన తరువాత ఫోన్‌లోని APN Settingsను మార్చుకోవల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రింది విధంగా APN Settingsను క్రియేట్ చేయండి. Name - RJio APN - jionet APN Type - Default Proxy - No changes Port - No changes Username - No changes Password - No changes Server - www.google.com MMSC - No changes MMS proxy - No changes MMS port - No changes MCC - 405 MNC - 857 or 863 or 874 Authentication type - No changes APN Protocol - Ipv4/Ipv6

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 బ్యాకప్ చేసుకోవటం మంచిది.

బ్యాకప్ చేసుకోవటం మంచిది.

ఈ APN Settings అన్ని సందర్భాల్లో వర్క్ కాకపోవచ్పు. కాబట్టి ట్రిక్‌ను అప్లై చేసే ముందు మీ పాత APN వివరాలను బ్యాకప్ చేసుకోవటం మంచిది.

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా

మీ ఫోన్‌లో పేరుకుపోయిన క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేయటం ద్వారా 4జీ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. ఇలా చేసేందుకు ఫోన్ Settingsలోకి వెళ్లి → Storage & USB → Under Internal Storage, tap on Cached data and hit clear cached data and confirm it by tapping on 'ok'.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్స్‌ను apply చేసే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, అందకు GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

Best Mobiles in India

English summary
How to Increase Reliance Jio 4G Data Speed on Your Phone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X