కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఎలా..?

డేటా రికవర్ చేసేందుకు పలు ఉత్తమమైన మార్గాలు..

|

పెన్‌డ్రైవ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉండే పెన్‌డ్రైవ్‌లు కరప్ట్ అవుతుంటాయి. డేటా కరప్ట్ అయిన యూఎస్బీ స్టోరేజ్ డ్రైవ్‌లలో మెమరీ ఉన్నట్లు చూపించదు. ఇటువంటి పరిస్ధితుల్లో కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్ నుంచి డేటాను రికవర్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను ఇప్పుడు చూద్దాం..

Read More : మీ ఫోన్‌లో, మీకు తెలియకుండానే యాప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయా?

కొత్త డ్రైవ్ లెటర్‌ను అసైన్ చేయండి

కొత్త డ్రైవ్ లెటర్‌ను అసైన్ చేయండి

కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను కంప్యూటర్ గుర్తించలేకపోతున్నట్లయితే కొత్త డ్రైవ్ లెటర్‌ను మీ స్టోరేజ్ మీడియాకు అసైన్ చేయవల్సి ఉంది. ఇలా చేయాలంటే, ముందుగా కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను కంప్యూటర్ యూఎస్బీ స్లాట్ కు స్టిక్ చేయండి.

స్టెప్ 1

స్టెప్ 1

ఇప్పు డు My Computerను సెలక్ట్ చేసుకుని మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వటం ద్వారా అనేక ఆప్షన్స్ తో కూడిన మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. వాటిలో Manage ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు computer management ప్యానల్‌లోకి వెళతారు. అక్కడ కూడా అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Disk Management ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 2
 

స్టెప్ 2

Disk Management ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇవ్వటం ద్వారా
అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి . వాటిలో Change Drive Letters and Pathsను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన లెటర్‌ను డ్రైవ్‌కు అసైన్ చేసి Ok బటన్ పై క్లిక్ చేసినట్లయితే డ్రైవ్ లెటర్ మారుపోతుంది. డ్రైవ్ లెటర్ మార్చినప్పటికి ఫలితం లేకపోయినట్లయితే ఈ క్రింద సూచించబోయే పద్ధతిని అనుసరించండి.

 కమాండ్ ప్రాంప్ట్ పద్ధతిలో పెన్‌డ్రైవ్‌ను రిపేర్ చేసుకును విధానం

కమాండ్ ప్రాంప్ట్ పద్ధతిలో పెన్‌డ్రైవ్‌ను రిపేర్ చేసుకును విధానం

కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్‌లోకి వెళ్లి మీ స్టోరేజ్ డ్రైవ్ ఏ రిమూవబుల్ డిస్క్ క్రింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M:), Removable Disk (H:). డ్రైవర్ లెటర్‌ను గుర్తుపెట్టుకోండి.

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా కంప్యూటర్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే. కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 2

స్టెప్ 2

కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r, అని టైప్ చేయండి. ఇక్కడ ‘m' అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్‌లో ఉంటే లెటర్‌ను ‘m' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్‌ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్‌‌లోని ఎర్రర్‌లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.

డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా

డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా

ఆన్‌లైన్‌లో అనేక డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకుని మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. కార్డ్ రీడర్ సహాయంతో మీ మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. ఆ తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను రన్ చేయటం ద్వారా మీ మెమరీ కార్డ్‌‍లోని డేటాను రికవర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How To Recover Files From Corrupted USB Drive. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X