Root చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రమాదాల నుంచి కాపాడుకోవటం ఎలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేసిన తరువాత సరైన ప్రికాషన్స్ తీసుకోకుంటే సెక్యూరిటీ ప్రమాదాలు మీ ఫోన్‌ను చుట్టుముట్టేస్తాయి.

|

మార్కెట్లో చాలా మంది యూజర్లు రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేయటం ద్వారా వారంటీని కూడా కొల్పోవల్సి వస్తుంది.

 
Root చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రమాదాల నుంచి కాపాడుకోవటం ఎలా..?

అంతేకాదు, సరైన ప్రికాషన్స్ తీసుకోకుంటే సెక్యూరిటీ ప్రమాదాలు కూడా ఆ ఫోన్‌ను చుట్టుముట్టేస్తాయి. కాబట్టి, రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను సెక్యూరిటీ ప్రమాదాల నుంచి దూరంగా ఉంచుంకునేదుకు పలు నివారణ చర్యలను చేపట్టావల్సి ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

Administrator access

Administrator access

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేయటం ద్వారా ఆ ఫోన్‌కు సంబంధించిన Administrator access రూట్ చేసిన వారికి లభిస్తుంది. ఈ Administrator accessను ఉపయోగించుకుని యాప్స్ ద్వారా అడ్వాన్సుడ్ ఫంక్షన్స్ పొందే వీలుంటుంది. ఇదే సమయంలో వీటి ద్వారా రిస్క్ కూడా పొంచి ఉంటుంది.

SuperSU మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌

SuperSU మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌

SuperSU అనే మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా రూట్ లెవల్ యాక్సస్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించే వీలుంటుంది. మీ ఫోన్‌లోని యాప్స్ రూట్ లెవల్ యాక్సిస్‌ను అడిగిన ప్రతిసారి ఈ SuperSU సాఫ్ట్‌వేర్‌ యూజర్ ను హెచ్చరించటం జరుగుతుంది.

యాప్స్ permissions  విషయంలో జాగ్రత్త..
 

యాప్స్ permissions విషయంలో జాగ్రత్త..

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న చాలా వరకు యాప్స్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ సమయంలో యూజర్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ డేటాను యాక్సెస్ చేసుకునేందుకు permissions అడుగుతాయి. పర్మిషన్‌ను గ్రాంట్ చేస్తేనే ఇవి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. కాబట్టి, ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ యాప్ మంచిదో కాదో నిర్ధారించుకున్న తరువాతనే పర్మిషన్ ఇవ్వండి

F- Secure App Permission

F- Secure App Permission

F- Secure App Permission యాప్ మీ ఫోన్‌లో ఉంచుకోవటం ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే యాప్ మంచిదో కాదో ఇట్టే తెలుసుకోవచ్చు. రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో F- Secure App Permission యాప్ తప్పనిసరిగా ఉండాలి.

 Firewall ప్రొటెక్షన్ తప్పనిసరి..

Firewall ప్రొటెక్షన్ తప్పనిసరి..

Firewall అనేది ఫోన్‌లోకి ఆపరేటింగ్ సిస్టంకు బయట నెట్‌వర్క్‌ల మధ్య అడ్డుగోడలో ఉంటుంది. ఈ Firewall సెక్యూరిటీని ఉపయోగించుకోవటం ద్వారా మీరు LAN, WiFi network, 3G లేదా రోమింగ్‌లో ఉన్నప్పుడు మీకు నచ్చిన విధంగా ప్రైవసీని ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. మీ ఫోన్‌లో ఏమైనా అనుమానస్పద యాప్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి నెట్‌వర్క్ యాక్సిస్‌ను ఈ Firewall ద్వారా పూర్తిగా బ్లాక్ చేసేయవచ్చు. ఇందుకు FWall+ (Android Firewall +) అనే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బెస్ట్ ఛాయిస్..

మంచి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ అవసరం..

మంచి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ అవసరం..

మంచి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించుకోవటం ద్వారా మీ రూటెడ్ ఆండ్రాయిడ్ డివైస్‌ను సెక్యూరిటీ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. రూట్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అనధికారిక యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే నమ్మకమైన ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం మంచిది.

CM Security వంటి సిస్టం క్లీనర్ యాప్స్

CM Security వంటి సిస్టం క్లీనర్ యాప్స్

CM Security వంటి సిస్టం క్లీనర్ యాప్స్‌ను మీ రూటెడ్ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫింగర్ ప్రింట్ లాక్, యాప్ సెక్యూరిటీ, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ వంటి అదనపు సెక్యూరిటీ ఫీచర్లు మీ ఫోన్‌లో యాడ్ అవుతాయి.

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికి పట్టివ్వటంలో గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ డివైస్, గూగుల్ అకౌంట్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లయితే లోపలి డేటాను రిమోట్ విధానంలో డిలీట్ చేయవచ్చు.

రిమోట్  విధానం ద్వారా..

రిమోట్ విధానం ద్వారా..

రిమోట్ విధానం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయదలచినట్లయితే ముందుగానే మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on.

 

Best Mobiles in India

English summary
How To Secure Rooted Android From Security Threats. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X