డిస్‌ప్లే దెబ్బతిన్న ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయటం ఎలా?

By Sivanjaneyulu
|

అనుకోకుండా మీ స్మార్ట్‌ఫోన్ క్రిందపడి పగిలిపోయిందా..? ఫోన్‌లు క్రిందిపడి డిస్‌ప్లేలు పగలిపోవటమనేది సర్వసాధరణంగా చోటుచేసుకునే విషయమే. స్మార్ట్‌ఫోన్‌లలో డిస్‌ప్లే ధ్వంసమైతే టచ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో నిస్సత్తువుగా మారిన స్మార్ట్‌ఫోన్‌ను అలా వదిలేయకుండా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

Read More : మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

డిస్‌ప్లే వ్యవస్థ ధ్వంసమైన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

డిస్‌ప్లే వ్యవస్థ ధ్వంసమైన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

క్రిందపడిన మీ ఫోన్‌లో టచ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని డిస్‌ప్లే కాస్తో కూస్తో కనిపించే విధంగా ఉన్నట్లయితే మీ ఫోన్‌కు యూఎస్బీ ఆన్ ద గో కేబుల్ సహాయంతో మౌస్‌ను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. USB OTG స్పెసిఫికేషన్ ద్వారా మొబైల్ ఫోన్‌లను ఇతర డివైస్‌లకు సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే వ్యవస్థ ధ్వంసమైన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

డిస్‌ప్లే వ్యవస్థ ధ్వంసమైన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

ప్రతీ ఆండ్రాయిడ్ పోన్ మినీ యూఎస్బీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పోర్ట్ సహాయంతో యూఎస్బీ సౌకర్యం ఉన్న మౌస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. మౌస్.. ఫోన్‌కు కనెక్ట్ అయిన వెంటనే డివైస్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఫోన్ అన్‌లాక్ అయిన వెంటనే డివైస్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి ఫోన్‌లోని డేటాను రికవర్ చేయండి.

 స్ర్క్కీన్ ఏ మాత్రం పనిచేయకుండా పోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?
 
స్ర్క్కీన్ ఏ మాత్రం పనిచేయకుండా పోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

స్ర్కీన్ పూర్తిగా ఆఫ్ అయిపోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయలంటే మీకు VNC ప్రోగ్రామ్ అనేది ఎంతో అవసరం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మార్కెట్లో ఇబ్బిడి ముబ్బిడిగా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా సంబంధిత ఫోన్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌‍ఫేస్‌ను కంప్యూటర్‌లోకి తీసుకువచ్చి కంట్రోల్ చేయవచ్చు.

ఏ మాత్రం పనిచేయకుండా పోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

ఏ మాత్రం పనిచేయకుండా పోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయటం ఎలా..?

ఈ మొత్తం ప్రక్రియ జరగాలంటే ముందుగా ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను మీ పీసీలో ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఫీచర్లు అదనంగా. మీ అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్‌‌ను ఎంపిక చేసుకోవటం మంచిది.

 డిస్‌ప్లే దెబ్బతిన్న ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయటం ఎలా?

డిస్‌ప్లే దెబ్బతిన్న ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయటం ఎలా?

పైన సూచించిన చిట్కాలను అమలుపరిచినప్పటికి డేటా రికవరీ సాధ్యమవని పక్షంలో మంచి రిపేర్ షాప్‌కు వెళ్లి డేటాను రికవర్ చేసుకుండి. ఈ ప్రాసెస్ కొంచం ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to use your broken smartphone from a PC. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X