మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్‌స్పాట్‌లా మార్చటం ఎలా..?

మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను క్రియేట్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి.

|

ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి వై-ఫై అనే పదం చాలా సుపరిచితం. వైఫై పూర్తి పేరు వైర్‌లెస్ ఫెడిలిటీ. ఈ టెక్నాలజీ ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు...

Read More : కూల్‌ప్యాడ్ నుంచి మూడు 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్

హాట్ స్పాట్‌గా మార్చి,  ఇతర డివైస్‌లకు ఇంటర్నెట్‌

హాట్ స్పాట్‌గా మార్చి, ఇతర డివైస్‌లకు ఇంటర్నెట్‌

వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్ స్పాట్‌గా మార్చి మీ ఇంట్లోని ఇతర డివైస్‌లకు ఇంటర్నెట్‌ను షేర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...

స్టెప్ 1

స్టెప్ 1

వై-ఫై హాట్‌ స్పాట్‌గా మార్చాలనుకుంటున్న మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో తప్పనిసరిగా వైర్‌లెస్ అడాప్టర్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉన్నా పర్వాలేదు. మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్ స్పాట్‌ను క్రియేట్ చేసేందుకు అనేక థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు Virtual Wifi Hotspot.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 2
 

స్టెప్ 2

ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ దాదాపుగా అన్ని విండోస్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకుని మీ ల్యాపీ‌లో లాంచ్ చేయండి. రెండు కంప్యూటర్ల మధ్య వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను సృష్టించటాన్నే కంప్యూటర్ పరిభాషలో adhoc అని పిలుస్తారు.

స్టెప్ 3

స్టెప్ 3

మీ ల్యాప్‌టాప్‌లో వై-ఫై హాట్‌స్పాట్‌ను సెటప్ చేసే క్రమంలో AdHoc-OPEN ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ హాట్‌స్పాట్‌‍కు ఇతర డివైస్‌లు ఏ విధమైన పాస్‌వర్డ్ సహాయం లేకుండా కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. మరో ఆప్షన్ AdHoc-WEPను సెలక్ట్ చేసుకున్నట్లయితే హాట్‌స్పాట్‌కు కనెక్ట్ అయ్యే ప్రతి కనెక్షన్‌కు పాస్‌వర్డ్ అవసరమవుతుంది.

స్టెప్ 4

స్టెప్ 4

సాధ్యమైనంత వరకు మీ హాట్‌స్పాట్‌ను సెక్యూరిటీ కనెక్టెడ్ మోడ్‌లో లాంచ్ చేయండి. సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా సెటప్ చేసిన తరువాత "Start Hotspot" ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ల్యాప్‌టాప్‌లో వర్చువల్ వై-ఫై హాట్ స్పాట్ సృష్టించబడుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5

మీ వై-ఫై హాట్ స్పాట్‌కు కనెక్ట్ అయ్యే అన్ని డివైస్‌ల్లోనూ ఇదే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడు మీ వై-ఫై హాట్ స్పాట్ ద్వారా వెలువడే వై-ఫై ఇంటర్నెట్‌ను మీ ఇంట్లోని డివైస్‌లకు షేర్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to Use Your Laptop as a Wi-Fi Hotspot. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X