డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్, ఎలా వాడాలి..?

వరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు కావాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.

|

మీరు మీ విలువైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో భద్రపరిచి వాటిని అవసరమైనప్పుడు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. మీ విలువైన డాక్యుమెంట్లు మెయిల్ లో పెట్టుకుంటే హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇలాంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ ఆన్‌లైన్ లాకర్‌ను ప్రవేశపెట్టింది. దీనిపైన చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వారందరి కోసం దీనికి సంబంధించిన విలువైన సమాచారాన్ని గిజ్‌బాట్ మీకందిస్తోంది.

స్టెప్ 1

స్టెప్ 1

ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.

స్టెప్ 2

స్టెప్ 2

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్ అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్ మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్‌కి కూడా ఓ సందేశం వస్తుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ఆ నంబర్ కింద ఓ  బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.

స్టెప్ 5

స్టెప్ 5

అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.

స్టెప్ 6

స్టెప్ 6

అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

మీరు అప్‌లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.

స్టెప్ 8

స్టెప్ 8

ఇక్కడ పత్రం సైజ్‌కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.

స్టెప్ 9

స్టెప్ 9

ఈ డిజిటల్ లాకర్‌కి పాస్‌వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్‌గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.

స్టెప్ 10

స్టెప్ 10

ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.

స్టెప్ 11

స్టెప్ 11

మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

Best Mobiles in India

English summary
How to use Digital Locker to Store your Digital Documents. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X