మీ ఫోన్‌ను ఇరకాటంలోకి నెట్టేసే 10 తప్పిదాలు..?

కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్నితప్పిదమే మన ఫోన్‌ను ఇరకాటంలోకి నెట్టేస్తుంది .

కొంత మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల సెక్యూరిటీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా వ్యవహరించటం వల్ల వారి నిర్లక్ష్యమే వారిని ఇరకాటంలోకి నెట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 మీ ఫోన్‌ను ఇరకాటంలోకి నెట్టేసే 10 తప్పిదాలు..?

Read More : పెద్ద డిస్‌ప్లేతో లెనోవో ఫాబ్ 2 ఫోన్, ధర రూ.11,999

సెక్యూరిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలోకి హ్యాకర్లు సునాయాశంగా మాల్వేర్లను జొప్పించి డేటాను నాశనం చేయగలుగుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవనగాహన లేమితో మనం చేసే చిన్నితప్పిదమే మన ఫోన్‌ను ఇరకాటంలో పడేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకింగ్ జోన్‌లోకి నెట్టేసే ప్రమాదాకర సందర్భాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూరిటీ అలర్ట్ 1

స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయకపోవటం కూడా సెక్యూరిటీ తప్పిదమేనంటున్నారు సెక్యూరిటీ నిపుణులు. మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.

సెక్యూరిటీ అలర్ట్ 2

పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ముందు
ఆచితూచి స్పందించండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెక్యూరిటీ అలర్ట్ 3

ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ లింక్ పై క్లిక్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే కొన్ని లింక్స్ ప్రమాదకర మాల్వేర్లను కలిగి ఉంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా మాల్వేర్ మీ
ఫోన్‌లోని డేటాను నాశనం చేసేస్తుంది.

సెక్యూరిటీ అలర్ట్ 4

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన అప్లికేషన్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ సోర్సుల ద్వారా పొందటం కూడా సెక్యూరిటీ లోపమే అంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు ఇన్‌స్టాల్ చేసుకునే ప్రతియాప్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేముందు వెరిఫికేషన్ అనేది చాలా అవసరం.

సెక్యూరిటీ అలర్ట్ 5

ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ మాల్వేర్లకు మరింతగా అట్రాక్ట్ అయ్యే అవకాశముంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెక్యూరిటీ అలర్ట్ 6

ఫోన్ పనితీరును మెరుగుపరించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో పాటు అప్లికేషన్ డెవలపర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు ఫాలో అవటం వల్ల ఫోన్ సెక్యూరిటీ రిస్క్‌ను దాదాపుగా తగ్గించుకోవచ్చు. కొంత మంది ఈ అప్‌డేట్‌లను ఏ మాత్రం లెక్క చేయరు.

సెక్యూరిటీ అలర్ట్ 7

చాలామంది తమ స్మార్‌ఫోన్‌లలో యాంటీ వైరస్‌ను ఇన్స్‌స్టాల్ చేయరు. వాళ్ల ఫోన్ రిస్క్‌లో ఉందనటానికి ఇదే తొలి సంకేతం. యాంటీవైరస్ సపోర్ట్‌లేని ఫోన్‌లను ఏ నిమిషంలోనైనా మాల్వేర్లు చుట్టుముట్టే ప్రమాదముంది.

సెక్యూరిటీ అలర్ట్ 8

వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వైర్‌లెస్ కనెక్షన్‌లను ఎప్పుడు ఆన్‌‌చేసి ఉంచటం వల్ల కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. జీమెయిల్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేయకుండా మర్చిపోవటం కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

సెక్యూరిటీ అలర్ట్ 9

అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత డేటాను మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేయటం ఏ మాత్రం మంచిది కాదని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. కొంత మంది ఇవేమి పట్టించుకోకుండా తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో పాటు పిన్ కోడ్‌లను ఫోన్‌లలోనే ఫీడ్ చేస్తుంటారు. పొరపాటున ఇలాంటి వారి ఫోన్ హ్యాక్‌కు గురైతే బోలెండత నష్టం వాటిల్లుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే



English summary
Serious smartphone security mistakes you need to stop making immediately. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting