మీ ఫోన్‌లో వైరస్ ఉందా? తీసేయటం ఎలా..?

మీ ఫోన్‌లోని వైరస్‌‌లను తొలగించేందుకు ముఖ్యమైన చిట్కాలు..

|

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుండటంతో వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీ స్మార్ట్‌ఫోన్‌‍ను మాల్వేర్ల నుంచి కాపాడుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

 మీ ఫోన్‌లో వైరస్ ఉందా? తీసేయటం ఎలా..?

Read More : 2016 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై Flipkart భారీ డిస్కౌంట్‌లు

మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్‌లోని వైరస్‌‌లను తొలగించేందుకు ముఖ్యమైన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటన్నాం..

స్టెప్ 1

స్టెప్ 1

స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్‌కు సంబంధించి రివ్యూను ముందుగా చదవండి. ఇలా చేయటం ద్వారా ఆ అప్లికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఏదైనా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్‌‌కు బదులుగా వేరొక మంచి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

స్టెప్ 2

2016లో సంచలనం సృష్టించిన Samsung ఫోన్‌లు2016లో సంచలనం సృష్టించిన Samsung ఫోన్‌లు

అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్ చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి.

స్టెప్ 3
 

స్టెప్ 3

విశ్వసనీయమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు సదరు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.

స్టెప్ 4

స్టెప్ 4

కేక పుట్టించే ఫీచర్లతో ‘కూల్ 1 డ్యుయల్', రూ.13,999కేకేక పుట్టించే ఫీచర్లతో ‘కూల్ 1 డ్యుయల్', రూ.13,999కే

స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా రోజు స్కాన్ చేస్తుండటం వల్ల ప్రమాదకర ఫైళ్లు మీ ఫోన్‌లోకి చేరవు. మీ స్మార్ట్‌ఫోన్‌లోని వైరస్‌ను మాన్యువల్‌గా తొలగించాలంటే ముందుగా మీ డివైస్‌లోని వైరస్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి.

స్టెప్ 5

స్టెప్ 5

లక్కీ గ్రాహక్ యోజన, 15,000 మంది విజేతలులక్కీ గ్రాహక్ యోజన, 15,000 మంది విజేతలు

వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. ఇందుకు ఫోన్ యూజర్ మాన్యువల్‌ను అవగాహన చేసుకోండి. ఆన్‌లైన్ యాంటీ వైరస్ టూల్స్‌ను ఆశ్రయించటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది.

స్టెప్ 6

స్టెప్ 6

ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

స్టెప్ 7

స్టెప్ 7

2016లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్ ప్లాన్స్2016లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్ ప్లాన్స్

స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు.

Best Mobiles in India

English summary
How to Remove Virus From SmartPhones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X