మీ ఫోన్ నుంచి హీటింగ్ వస్తుందా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య 'overheating'.

|

ఫోన్‌లలో ఎక్కువ సేపు వీడియో కాల్స్ చేయటం, గ్రాఫికల్ గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయటం వల్ల ఓవర్‌హీట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోన్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను అప్లై చేయటం ద్వారా ఓవర్‌హీట్ ఫోన్‌ను కూల్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడ చూద్దాం...

రూ.99 అవసరం లేదు, సంవత్సరమంతా రోజుకు 1జీబి?

విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల

విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

 బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌..

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌..

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

నాసిరకం బ్యాటరీలు కూడా కారణం...
 

నాసిరకం బ్యాటరీలు కూడా కారణం...

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

 పరిమితికి మించి యాప్స్

పరిమితికి మించి యాప్స్

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

గేమ్స్ ఆడటం తగ్గించండి

గేమ్స్ ఆడటం తగ్గించండి

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో ..

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో ..

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

Best Mobiles in India

English summary
Why smartphones heat up and overheat, and how to stop it. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X