2017, గూగుల్ మేజర్ అనౌన్స్‌మెంట్స్ ఇవే

గూగుల్ అనౌన్స్ చేసిన ఆండ్రాయిడ్ గో (Android Go) ప్లాట్‌ఫామ్ గురంచి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటోంది.

|

అమెరికా వేదికగా మే 17, మే 19 మధ్య జరిగిన 2017 గూగుల్ I/O డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగూల్ పలు మేజర్ అనౌన్స్‌మెంట్స్ చేసింది. ఈ అనౌన్స్‌మెంట్స్ బట్టి చూస్తుంటే హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌‌వేర్‌ పైనే గూగుల్ ఎక్కువుగా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ అనౌన్స్ చేసిన సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ వివరాలు మీ కోసం..

Android O

Android O

గూగుల్ నెక్స్ట్ జనరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,  Android O బేటా వర్షన్‌ను గూగుల్ విడుదల చేసింది. బేటా వర్షన్‌‌లో అందుబాటులో ఉండే Android O ప్రివ్యూను నెక్సుస్ అలానే పిక్సల్ డివైసెస్‌లలో పరీక్షించుకోవచ్చు. నోటిఫికేషన్ డాట్స్, పిక్షర్ ఇన్ పిక్షర్, ఫ్లూయిడ్ ఎక్స్ పీరియన్స్ వంటి ప్రత్యేకతలు ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నాయి.

Android Go

Android Go

ఇదే వేదక పై గూగుల్ అనౌన్స్ చేసిన ఆండ్రాయిడ్ గో (Android Go) ప్లాట్‌ఫామ్ గురంచి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు లైటర్ వర్షన్‌గా భావిస్తోన్న Android Go మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను 1జీబి అంతకంటే తక్కువ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉన్న ఫోన్‌లలో రన్ చేసుకునే వీలుంటుందట.

 Google Assistant

Google Assistant

యాపిల్ iOS యూజర్ల కోసం డిజైన్ చేయబడిన గూగుల్ అసిస్టెంట్ యాప్‌ను 2017 I/O డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ విడదుల చేసింది. ప్రస్తుతానికైతే యూఎస్ మార్కెట్లో మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇటు ఆండ్రాయిడ్ వర్షన్ గూగుల్ అసిస్టెంట్ యాప్‌లోను కొత్త ఫీచర్లను గూగుల్ చేర్చింది. తాజా అప్‌డేట్‌తో గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Google Home

Google Home

2016లో గూగుల్ లాంచ్ చేసిన స్మార్ట్ స్పీకర్ గూగుల్ హోమ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌లను గూగుల్ అనౌన్స్ చేసింది. తర్వలోనే ఈ స్పీకర్‌లో హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్, ప్రోయాక్టివ్ అసిస్టెన్స్, షెడ్యూలింగ్ క్యాలెండర్ అపాయింట్‌‌మెంట్స్ వంటి సదుపాయాలను చేర్చబోతున్నట్లు గూగుల్ తెలిపింది.

 Google for Jobs

Google for Jobs

మాన్సటర్, లింకిడిన్, కెరీర్ బిల్డర్, ఫేస్‌బుక్, గ్లాస్‌డోర్ వంటి సంస్థల భాగస్వామ్యంతో జాబ్ సీకర్స్ కోసం బెటర్ సొల్యూషన్‌ను తీసుకురాబోతున్నట్లు గూగుల్ తెలిపింది.

Smart Reply

Smart Reply

"Smart Reply" పేరుతో ప్రత్యేకమైన ఆప్షన్‌ను గూగుల్ ఇటీవల తన జీమెయిల్ యాప్‌లో యాడ్ చేసింది. ఈ స్మార్ట్ రిప్లై ఆప్షన్‌ను Google I/O 2017 keynote ఈవెంట్‌లో భాగంగా ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ అనౌన్స్ చేసారు. ఈ ఫీచర్, మీకు వచ్చే ఈ-మెయిల్స్‌కు సంబంధించి క్విక్ రెస్పాన్స్‌ను సజెస్ట్ చేస్తుంది.

Google Photos

Google Photos

తమ Google Photos ప్లాట్‌ఫామ్‌ను ప్రతినెలా 500 మిలియన్ల యూజర్లు యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. తాజాగా ఈ యాప్‌లో Shared Libraries, Photo Albums, Suggested Sharing వంటి కొత్త ఫీచర్లను యాడ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.

Standalone VR headsets

Standalone VR headsets

HTC Vive, Lenovo కంపెనీల భాగస్వామ్యంతో గూగుల్ స్టాండ్‌ఎలోన్ వీఆర్
హెడ్‌సెట్‌లను రూపొందించబోతోంది. అంతేకాకుండా, గూగుల్ లెన్స్ అనే ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ కెమెరా సాఫ్ట్‌వేర్‌ను కూడా గూగుల్ అనౌన్స్ చేసింది.

Best Mobiles in India

English summary
Google I/O 2017: All the major announcements lineup up for you. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X