సైంటిస్టులకే మిస్టరీగా మారిన మిస్టరీలు

ప్రపంచంలో ఎన్నో చేధించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది.

By Hazarath
|

ప్రపంచంలో ఎన్నో చేధించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. వీటిని సైంటిస్టులు చేధించారా అనే ప్రశ్నవేసుకుంటే..కొన్ని మిస్టరీలను శాస్ర్తవేత్తలు ఇప్పటివరకు చేధించలేదు. ఆ మిస్టరీలకు ,అలాగే ఆ సంఘటనలకు సంబంధించిన సమాధానం వారికి ఇంతవరకు చిక్కలేదు. వాటి గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సైంటిస్టుల ఊహలకు అందని మిస్టరీలు ఏంటో మీరే చూడండి.

 

6 వేల ఏళ్ల క్రితం ఇంత ఉచకోత జరిగిందా : షాక్ పుట్టిస్తున్న అస్థి పంజరాలు

1.

1.

6 నుంచి 8 అంగుళాల మధ్య ఉన్న అస్థి పంజరం ఇది. చిలియన్ ఘోస్ట్ టౌన్ లో బయట చిక్కింది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థిపంజరంగా తేల్చారు. మిస్టరీ ఏంటంటే ఇంత చిన్న మనుషులు వారి ఆకారం ఏ కాలంలో ఉన్నాయనేది తేల్చలేకున్నారు.

2.

2.

1900వ దశకంలో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది. కాని ఆ తర్వాత బ్లడ్ గ్రూపు అనేక కేటగిరిల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరిలు ఎలా వచ్చాయనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అనేక ధియరీలు, శాస్ర్తవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు.

3.
 

3.

ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతి రోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ మెటిరాలజిస్టులు, న్యూమరస్ సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. దాదాపు 20 కిలోమీటర్లు వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడి ప్రజల్ని భయపెడతాయి. అయితే చాలామంది సముద్రపు గాలులు అని చెబుతారు.

4.

4.

ఈ బాడీని చనిపోయిన 2000 సంవత్సరాల తరువాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీల్లో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే. ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏం లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు చేధించలేకున్నారు. 2000 సంవత్సరాల తరువాత కూడా బాడీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.

5.

5.

గత ఏడు దశాబ్దాల్లో దాదాపు 90 ఢిఫరెంట్ కమర్షియల్ ఎయిర్ లైన్స్ మిస్సయ్యాయి. వీటి సంఖ్య 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా.అవి ఎందుకు మిస్సయ్యాయి. ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేది పెద్ద మిస్టరీనే. కనీసం వాటి ఆనవాళ్లు కూడా చిక్కలేదు.

6.

6.

ఈ ఫోటోలో కనిపిస్తున్న వారి పేర్లు హిక్సన్ , పార్కర్. 1973వ సంవత్సరంలో వీరు ఆపీసులో పనిచేస్తుండగా ఎండ్రకాయ లాంటి చేతులతో పెద్ద పంజాలను కలిగిన గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. ఇప్పటికీ వారు అదే స్టోరీని చెబుతున్నారు. వారిద్దరినీ వేరే రూంలో పెట్టి అడిగినా జరిగిన స్టోరీని పూసగుచ్చినట్లు చెబుతున్నారు.

7.

7.

1876లో వచ్చిన అదృశ్య వానలో ఓ గుర్తు తెలియని పదార్థం సైంటిస్టులకు దొరికింది. అది ఏంటనేది శాస్త్రవేత్తల బుర్రలకు ఇప్పటికీ తట్టడం లేదు.

8

8

1954లో నల్లగా కత్తిని పోలి ఉన్న ఓ శాటిలైట్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది అది ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అయితే ఇది 13000 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభ్యం కావడం లేదు.

9

9

1967 దశకంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి హోరాల్డ్ హోల్ట్ స్విమ్మింగ్ చేస్తూ కనపడకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ కనపడలేదు. ఎంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేసినా కాని ఆయన్ని ఇంతవరకు కనిపెట్టలేకపోయారు.

10.

10.

2003లో బోయింగ్ విమానం అంగలాన్ ఎయిర్ పోర్ట్ నుంచి మిస్సయింది. ఆకాశంలోకి వెళ్లిన తరువాత ఎటువంటి సిగ్నల్స్ లేవు. అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయిందని అంచనా వేశారు. కాని అది ఇప్పటికీ మిస్టరీనే. దాని ఆనవాళ్లు కూడా కనపడలేదు.

11

11

గొరిల్లాలు చనిపోయే ముందు బైబై అని చెప్పి చనిపోతాయట. దాని భాషలో అది చనిపోతూ కొకొ అని చెప్పి చనిపోతుందని చెబుతారు. అదెలా సాధ్యం అనేది మిస్టరీనే.

12

12

కెప్లర్ టెలిస్కోప్ లో సుమారు 1200ల మచ్చలతో కూడిన గ్రహాలు కనిపిస్తాయి. కాని ప్రపంచంలో ఉండేది కేవలం 68 గ్రహాలు మాత్రమే. అయితే ఈ మిగతా గ్రహాలు ఏంటనేది మిస్టరీగా మారిన ప్రశ్న.

13

13

1518వ సంవత్సరంలో డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి కరాళ నృత్యం చేసింది. దాని మూలంగా ఎంతో మంది చనిపోయారు. అయితే వారు డ్యాన్స్ వేస్తూ చనిపోయారు. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటి వరకు తెలియలేదు.

14

14

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దాదాపు 35 శాతం తన వినికడి శక్తిని కోల్పోయారు. అలాగే మెమొరీని కోల్పోయారు. ఇతనో గ్రేట్ పియనిస్ట్. అయితే కీ బోర్డ్ మీద కూర్చున్నప్పుడు తీవ్ర ఒత్తిడితో భాదపడ్డారు. మెమొరీ లాస్ అయిన వ్యక్తికి అదెలా సాధ్యమనేది అర్థం కాని ప్రశ్న.

15

15

240 పేజీలతో కనిపిస్తున్న ఈ పుస్తకం పేరు The Voynich Manuscript. ఇది 15వ శతాబ్దంలో రాశారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే అందులో ఉపయోగించిన భాష ఏంటనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు.

16.

16.

1968వ సంవత్సరంలో చికాగోలో ఓ గోడ మీద ఈ బైక్ ని కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన మోటర్ సైకిల్ ఇది. ఇప్పటికీ ఇది ఇప్పటికీ సమర్థవంతంగా నడుస్తూనే ఉంది. ఇంజిన్ టెక్నాలజీ ఏంటనేది మిస్టరీనే.

17.

17.

అమెరికాలో స్టీరియో బ్లైండ్ అనే వ్యాధితో 66 సంవత్సరాల పాటు బాధపడిన ఓ వ్యక్తి 3 డీ గ్లాసులు కొని సినిమా చూడగానే అతని బ్రెయిన్ లో చలనం కలిగింది. మరి అదెలా సాధ్యం అయిందో తెలుసుకునేందుకు సైంటిస్టులు కుస్తీలు పడుతూనే ఉన్నారు.

18.

18.

1975వ సంవత్సరంలో చైనాలోని ఓ సిటీనుండి అకస్మాత్తుగా కుక్కలను, జంతువులను, మనుషులను తరలించిన కొద్ది గంటల్లోనే 7.3 మాగ్నిట్యూట్ తో కూడిన భూకంపం వచ్చింది. దాదాపు 90 శాతం నగరాన్ని నేలమట్టం చేసింది.అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలియదు.

19.

19.

కోస్ట్ ఆస్రేలియాలో కనుగొన్న ఈ వైరస్ పేరు పండోరా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వైరస్. ఈ వైరస్ లో ఉండే జెనిటిక్స్ ఏంటనేది ఇప్పటివరకు గుర్తించలేకపోతున్నారు.ఇది మానవ శరీరంలోకి వెళితే చాలా ప్రమాదమని చెబుతున్నారు.

20.

20.

ఈ నదినే డెవిల్ కెటిల్ అని పిలుస్తారు. ఇందులో దిగిన వారు తిరిగి బయటకు రాలేదు. వారు ఎక్కడికి వెళ్లారనేది ఇప్పటివరకు తెలియదు. కనీసం బాడీలు కూడా చిక్కలేదు.ఇది యుఎస్ ఏలో ఉంది.

21.

21.

కెనడాలోని నిధికోసం తవ్విన అతి పెద్ద గొయ్య ఇది. ఇక్కడ భూమి లోపల రెండు మిలియన్ల సంపద దాగి ఉందని పుస్తకాల్లో చదివి ఇంత పెద్ద గొయ్యను తవ్వారు. కాని అయితే కొంత కాలానికి వరదలు రావడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. మరి ఆ నిధిని ఎప్పటికీ చేరుకుంటారనేది పెద్ద మిస్టరీనే.

22

22

విశ్వంలో ఓ చీకటి పదార్థం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. మరి అదెక్కడ ఉందనేది తెలుసుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు. అసలు అదెలా ఉంటుంది..ఏమిటది.. దాని గురించిన సమాచారం కనుక్కోలేకపోతున్నారు.

23.

23.

ఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడుఆ మిస్టరీ గ్రహాన్ని సూర్యుడు మింగేశాడు

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదిషాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

ఐన్‌స్టీన్ తరంగాలకు కొత్త ఊపిరిఐన్‌స్టీన్ తరంగాలకు కొత్త ఊపిరి

 

 

24

24

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Mysterious facts and incidents that still remain unexplained to this date

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X