ఆకాశంలో అద్భుతం జరిగేది నేడే

By Hazarath
|

దాదాపు 10 ఏళ్ల తరువాత ఆకాశంలో ఓ అద్భుతం ఏర్పడనుంది. ఈ రోజు జరగనుంది. పదేళ్ల అనంతరం సూర్యుడ్ని బుధ గ్రహం దాటివెళ్లే అరుదైన సన్నివేశం గగనంలోసాయంత్రం చోటుచేసుకోనుంది. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని ఒట్టి కళ్లతో చూడొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ రోజు ఏం జరుగుతుంది. వాచ్ దిస్ స్టోరి.

 

Read more : మూడు రోజులు వాట్సప్ బంద్

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

భూమి సహా గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాయనే విషయం తెలిసిందే! అయితే, ఈ పరిభ్రమణాలలో మనకు కనిపించేవి చాలా అరుదు. ఇలాంటి అరుదైన ఘటనే ఈ నెల 9న చోటుచేసుకోనుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

దశాబ్దంలో ఎనిమిది సార్లు సంభవించే అద్భుతం ఆరోజు జరగనుందని వారు వెల్లడించారు. బుధగ్రహం సూర్యుడ్ని ఆ రోజు దాటనుందని వారు చెప్పారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న బుధగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చని చెప్పారు. భారీ ఆకారంలో ఉండే సూర్యుడి ముందు నల్లటి చుక్కలాగా బుధుడు ప్రయాణిస్తాడట.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం
 

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

సాయంత్రం 4:41 నిమిషాల నుంచి సూర్యా స్తమయం దాకా కన్పిస్తుంది. 7:30 నిమిషాల పాటూ సాగే ఈ ప్రయాణంలో మనం చూడగలిగేది మాత్రం కేవలం 3 గంటలలోపేనని అన్నారు. బుధ గ్రహ వ్యాసం సూర్యుడికన్న చిన్నదిగా వుండడం వల్ల ఈ సన్నివేశం చిన్న చుక్కవలే కనిపించనుంది.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

సౌరవ్యవస్థలో సూర్యుడికి భూమికి మధ్య నుంచి బుధుడు ప్రయాణించినపుడు.. ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం వలన ఈ అరుదైన ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు చెన్నై బిల్లా ప్లానిటోరియంలో నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

ఒక నల్లటి చుక్క మాదిరిగా సూర్యుడి మీదుగా బుధుడు ప్రయాణిస్తాడు అని పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ డైరెక్టర్ సంజీవ్‌సేన్ తెలిపారు. భూమి నుంచి ఓ కోణంలో చూసినపుడు సూర్యబింబంతో పోల్చితే బుధుడు చాలా చిన్న పరిమాణంలో కనిపిస్తాడని పేర్కొన్నారు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

జపాన్, ఆగ్నేయాసియా మినహా ఆసియాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో, యూరప్, ఆఫ్రికా, గ్రీన్‌లాండ్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

దేశంలో గత 1999 నవంబర్‌ 15వ తేదీ, 2003 మే 7వ తేదీ, 2006 నవంబర్‌ 8వ తేదీన ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మళ్లీ పదేళ్ల అనంతరం 9వ తేదీ చోటుచేసుకోనున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఒట్టికళ్లతో వీక్షించరాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

శతాబ్దానికి 8 సార్లు మాత్రమే బుధగ్రహం సూర్యుడ్ని దాటి వెళుతుందని, 2019 నవంబర్‌ 11వ తేదీ మళ్లీ ఇటువంటి సన్నివేశం చూడవచ్చని వారు తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటన 16 ఏండ్ల విరామం తర్వాత అంటే 2032 నవంబర్ 13న కనిపిస్తుందని సేన్ వెల్లడించారు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

సూర్యబింబంపై బుధుడి ప్రయాణ వ్యవధి సుమారు 7.30 గంటల పాటు ఉంటుంది. ఈ అపురూప దృశ్యం చివరి అంకానికి చేరుకోనే సమయానికి సూర్యాస్తమయం అవ్వడం వల్లన భారతీయులు నాలుగో దశ ప్రయాణాన్ని చూడటానికి వీలుపడదు.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

ఈ ప్రక్రియ ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలలో సాయంత్రం 4.41 గంటలకు ప్రారంభమవుతుం ది. ఢిల్లీలో సూర్యాస్తమయం 7.01 గంటలకు అవుతుండటం వలన ఆ ప్రాంతవాసులు దాదాపు 2.20 గంటలు మాత్రమే చూసే అవకాశం కలుగుతుంది.ఆయా ప్రాంతాల సూర్యాస్తమయాన్ని బట్టి ముంబైవాసులు 2.24 గంటలు, కోల్‌కతావాసులు 1.26 గంటలు, చెన్నై ప్రజలు 1.45 గంటలు చూ సే అవకాశముంటుంది.

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

ఈ ఘటనను నేరుగా వీక్షించరాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కళ్లజోళ్లు ధరించి వీక్షించాలని సూచించారు. అలాగే, ఎలా పడితే అలా చూస్తే ఇది కనిపించే అవకాశాలు తక్కువని తెలిపారు.

rn

10 ఏళ్ల తరువాత ఈ నెల 9న ఆకాశంలో అద్భుతం

దీనికి సంబంధించి నాసా వీడియో రిలీజ్ చేసింది

Best Mobiles in India

English summary
Here Write NASA to Provide Coverage of May 9 Mercury Transit of the Sun

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X