ఇవి పాటిస్తే, మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫ్

ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదకర వైరస్‌ల నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు పలు చిట్కాలు..

సామ్‌సంగ్ నుంచి లెనోవో వరకు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

టిప్ 1

టిప్ 1

ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

టిప్ 2

టిప్ 2

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాని ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు
కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

టిప్ 3

టిప్ 3

ఈ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

టిప్ 4

టిప్ 4

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

టిప్ 5

టిప్ 5

మీ ఫోన్‌లోని ఇ-మెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అప్లికేషన్‌లను పరిరక్షించుకునేందుకు ‘యాప్ లాక్' ‘App Lock' అనే అప్లికేషన్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. తద్వారా మీ అకౌంట్‌లను ఎవరు పడితే వాళ్ల ఓపెన్ చేసేందకు ఆస్కారం ఉండదు.

టిప్ 6

టిప్ 6

నెట్ బ్యాకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి లావాదేవీలను స్మార్ట్‌ఫోన్ ద్వారా నిర్వహిస్తున్న సమయంలో అప్రమత్తత ఎంతో అవసరం. ఆయా అకౌంట్‌ల పాస్ వర్డ్ లను తరచూ మార్చటం మంచిది.

టిప్ 7

టిప్ 7

అనధికారిక యాప్ స్టోర్ల నుంచి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వే‌ర్‌లను ఫోన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.

Best Mobiles in India

English summary
10 ways to harden the security on your Android phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X