మోటరోలా తరువాతి ఫోన్ Moto M, మెటల్ బాడీ, 4జీబి ర్యామ్‌

|

మోటరోలా అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ Moto Mకు సంబంధించి ఆసక్తికర సమచారం వెలుగులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ త్వరలో మార్కెట్లోకి రాబోతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి ముఖ్యమైన వివరాలు వెబ్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రత్యేకంగా ఆసియా మార్కెట్ల కోసం డిజైన్ చేయబడుతోన్న ఈ ఫోన్ మెటల్ బాడీతో రాబోతున్నట్లు సమాచారం.

Read More : రూ.800 కడితే మోటరోలా ఫోన్ ఇచ్చేస్తున్నారు

మెటల్ బాడీతో

మెటల్ బాడీతో

మోటరోలా నుంచి విడుదలవుతోన్న మొట్టమొదటి మెటల్ బాడీ డిజైన్ ఫోన్ Moto M కావటం విశేషం.

Image Source: TechDroider

వెనుక భాగంలో ఫింగర్ ప్రింగ్ స్కానర్

వెనుక భాగంలో ఫింగర్ ప్రింగ్ స్కానర్

రూమర్ మిల్స్ చెబుతోన్న వివరాల ప్రకారం మోటో ఎమ్ ఫోన్‌లో ఫింగర్ ప్రింగ్ స్కానర్ వెనుక భాగంలో ఉంటుందట. ఇప్పటి వరకు అన్ని మోటో డివైస్ లలో ముందు భాగంలో మాత్రమే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఏర్పాటు చేయటం మనం చూసాం.

మొట్టమొదటి సారిగా మీడియాటెక్ ప్రాసెసర్‌

మొట్టమొదటి సారిగా మీడియాటెక్ ప్రాసెసర్‌

Moto M ఫోన్‌లో మొట్టమొదటి సారిగా మీడియాటెక్ 2.1గిగాహెర్ట్జ్ MT6755 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం.

4జీబి ర్యామ్‌, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్
 

4జీబి ర్యామ్‌, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

రూమర్ మిల్స్ చెబుతోన్న వివరాల ప్రకారం మోటో ఎమ్ ఫోన్.. 4జీబి ర్యామ్‌తో, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతోంది.

 హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి Moto M ఫోన్.. 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం. ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుందట.

కెమెరా విషయానికి వచ్చేసరికి ..

కెమెరా విషయానికి వచ్చేసరికి ..

కెమెరా విషయానికి వచ్చేసరికి 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

English summary
7 Things to Expect From the UPCOMING Moto. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X