4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

|

బార్సిలోనా వేదికగా మార్చి 2 నుంచి నిర్వహించనున్న ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015’ మొబైల్ ట్రేడ్ షోలో సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీ వంటి ప్రముఖ కంపెనీలు 4జీబి ర్యామ్ ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముందన్న ఊహాగానాలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్‌‌ చల్ చేస్తున్నాయి. ఆసుస్ ఇప్పటికే తన 4జీబి మోడల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ .ఆసుస్ జెన్‌ఫోన్ 2‌ను సీఈఎస్ 2015 వేదికగా ప్రదర్శించింది. ఇదే తరహాలో షియోమీ కూడా ఎంఐ నోట్ ప్రో పేరుతో బీజింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యకమ్రంలో 4జీబి ర్యామ్ ఫోన్‌ను ప్రదర్శించింది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న పలు 4జీబి ర్యామ్ ఫోన్‌‍లను ఇప్పుడు చూద్దాం...

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

ఆసుస్ జెన్‌ఫోన్ 2

సీఈఎస్ 2015లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. 4జీబి ర్యామ్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగద్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2.3గిగాహెర్ట్జ్ 64 బిట్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

షియోమీ ఎంఐ నోట్ ప్రో

2కే డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్‌ను ఇటీవల బీజింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యకమ్రంలో ప్రదర్శించారు. 4జీబి ర్యామ్‌తో లభ్యమయ్యే ఈ డివైస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మార్చిలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!
 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

మార్కెట్ వర్గాలను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 పూర్తిగా నిరుత్సాహపరిచిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్6 పై సామ్‌సంగ్ పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. మెటల్ ఇంకా గ్లాస్ కలయకతో తీర్చిదిద్దబడుతున్న ఈ ప్రీమియమ్ డివైస్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్లు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ వంటి శక్తివంతమైన పీఛర్లను ఈ ఫోన్ కలిగి ఉండే అవకాశమంది.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

హెచ్‌టీసీ హిమా (ఎం9)

సరికొత్త డిజైన్‌తో హిమా అనే కోడ్ నేమ్‌తో హెచ్‌టీసీ రూపొందిస్తున్న ఫోన్ ఎం9. ఈ ప్రీమియమ్ డివైస్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్లు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన పీఛర్లను ఈ ఫోన్ కలిగి ఉండే అవకాశమంది.

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4

ఎక్స్‌పీరియా జెడ్3కి సక్సెసర్ వర్షన్‌గా సోనీ విడుదల చేయబోతున్న ఎక్స్‌పీరియా జెడ్4కు సంబంధించి ఇప్పటికే ఆసక్తికర ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న ఈ ఫోన్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్, 4జీ ఎల్టీఈ వంటి ఆసక్తికర ఫచర్లతో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

హువావీ మేట్ డీ8

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న హువావీ మేట్ డీ8 4జీబి ర్యామ్, అప్‌డేటెడ్ 8 కోర్ ప్రాసెసర్ వంటి ఆసక్తికర ఫచర్లతో లభ్యమయ్యే అవకాశముంది.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

పేరు తెలియని మోటరోలా స్మార్ట్‌ఫోన్

నెక్సస్ 6 తరహాలోనే మోటరోలా ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఫోన్ 5.9 అంగుళాల స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఎల్టీఈ కనెక్టువిటీ వంటి ఫీచర్లతో అందుబాటులకి రానుంది.

 

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

4జీబి ర్యామ్‌తో వచ్చేస్తున్నాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో సామ్‌సంగ్ పరిచయం చేయబోతోన్న ఈ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 తరహాలోనే శక్తివంతమైన ఫీచర్లతో అలరించే అవకాశముంది.

 

Best Mobiles in India

English summary
8 New and Upcoming Smartphones With 4GB RAM. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X