ఆండీ రూబిన్ ‘Essential phone’ పూర్తి వివరాలు..

యాపిల్, సామ్‌సంగ్‌లు లాంచ్ చేస్తున్న ప్రీమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు ప్రధాన పోటీగా ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్లు నిలవబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

|

ఆండ్రాయిడ్ రూపకర్త ఆండీ రూబిన్, ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన 'Essential phone' మార్కెట్లో లాంచ్ అయ్యింది. టైటానియమ్ అండ్ సిరామిక్ బిల్డ్, ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అంశాలు ఈ డివైస్‌కు ప్రధాన హైలెట్స్. మంగళవారం లాంచ్ అయిన ఎసెన్షియల్ ఫోన్ (మోడల్ నెంబర్ PH-1) స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

ప్రాసెసర్

ప్రాసెసర్

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్, 2.45 GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. క్వాల్కమ్ అందిస్తోన్న చిప్‌సెట్‌లలో ఇది కొత్తది. ఈ ప్రాసెసర్‌తో క్లబ్ చేసిన అడ్రినో 540 జీపీయూ ఫోన్ గ్రాఫిన్ విభాగాన్ని చూసుకుంటుంది.

 

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్ 4జీబి ర్యామ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

ఇంటర్నెల్ స్టోరేజ్...

ఇంటర్నెల్ స్టోరేజ్...

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. స్టోరేజ్ ను విస్తరించుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయం ఉండదు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్, 5.7 అంగుళాల LTPS డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2560x 1312పిక్సల్స్. ఈ ఫోన్ డిస్‌ప్లే‌కు సంబంధించి నిష్ఫత్తి రేషియో అసాధారణ 19:10గా ఉంటుంది. రెగ్యులర్ ఫోన్‌లలో ఈ నిష్పత్తి 16:9గా ఉంటుంది.

కెమెరా

కెమెరా

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్, డ్యుయల్ కెమెరా సిస్టంతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన రెండు 13 మెగా పిక్సల్ సెన్సార్లు హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. ఈ రెండు సెన్సార్‌లలో ఒకటి స్టాండర్డ్ RGB సెన్సార్ కాగా మరొకటి monochrome సెన్సార్. లేజర్ అండ్ ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే కాలిటీ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరా సెటప్‌లో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ వీడియో కాల్స్‌ను నిర్వహించుకోవటంతో పాటు 4కే వీడియోలను కూడా షూట్ చేసుకునే వీలుంటుంది.

సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ...

సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ...

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అయితే ఆ వర్షన్ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఆండీ రూబిన్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న smart/virtual అసిస్టెంట్ ఈ ఫోన్ కు మరో ప్రధాన ఆకర్షణ. 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

బ్యాటరీ విషయానికొస్తే...

బ్యాటరీ విషయానికొస్తే...

ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్ 3,040mAh బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ధర..

ధర..

యూఎస్ మార్కెట్లో ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్ ధరను 699 డాలర్లుగా నిర్ణయించారు. మన కరెన్సీలో ఈ విలువ రూ.45,097గా ఉంది. యాపిల్, సామ్‌సంగ్‌లు లాంచ్ చేస్తున్న ప్రీమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు ప్రధాన పోటీగా ఆండీ రూబిన్ ఎసెన్షియల్ ఫోన్లు నిలవబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Andy Rubin the 'Father of Android' has just launched the Essential phone: Price, features and more. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X