యాపిల్ ఐఫోన్ 6 వచ్చేస్తోంది!!

|

టెక్నాలజీ ప్రపంచంలో చారిత్రాత్మక ఆవిష్కరణలకు 2014 వేదిక కానుంది. ప్రతిష్టాత్మక గాడ్జెట్ ఎగ్జిబిషన్ ఐఎఫ్ఏ 2014 (IFA 2014) బెర్లిన్ వేదికగా ఈ సెప్టంబర్ 5 నుంచి 9వరకు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మరోవైపు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తన తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్6ను సెప్టంబర్ 9న కుపర్టినో, కాలిఫోర్నియాలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రెస్‌నోట్‌లను విడుదల చేసింది. ఇదే కార్యక్రమంలో యాపిల్ తన ఐవాచ్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

 
యాపిల్ ఐఫోన్ 6 వచ్చేస్తోంది!!

యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఐఫోన్ 6కు సంబంధించి క్లోన్ డివైస్‌లు చైనా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయంటూ వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఐఫోన్ 5ఎస్‌తో పోలిస్తే త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 6 అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెద్దదైన తెర, శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు ఈ ఫోన్ అమ్మకాలకు మరింత అనుకూలించే అవకాశముందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్ ఐపోన్ 5ఎస్ సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6 పై ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఐఫోన్ 5ఎస్‌తో ఫింగిర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్ 6లో సోలార్-ఛార్జింగ్ సఫైర్ గ్లాస్ స్ర్కీన్‌ను నిక్షిప్తం చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మాట్ మార్గోలిస్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను పొందుపరచటం ద్వారా ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుందట. అయితే ఈ అంశానికి సంబంధించి యాపిల్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X