ఐఫోన్ 7 పై రూ.17,000 తగ్గింపు...

ఈ డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్‌ల పైనా వర్తిస్తుంది.

|

ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు యాపిల్ ఐఫోన్స్ పై పోటీపోటీగా ధరలు తగ్గిస్తున్నాయి. ఫాదర్స్ డే ఆఫర్ పేరుతో ఇటీవల ఐఫోన్ 6 (16జీబి వర్షన్) పై ఫ్లిప్‌కార్ట్ రూ.15,000 తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బాటలోనే అమెజాన్ కూడా యాపిల్ ఐఫోన్ 7 పై రూ.17,000 తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్‌ల పైనా వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్స్‌తో పాటు కొన్ని బుయ్‍బ్యాక్ ఆఫర్స్‌ను కూడా అమెజాన్ తన కస్టమర్‌లకు అందుబాటులో ఉంచింది.

 

ఐఫోన్ 7  ఏఏ మోడల్ పై ఎంతెంత ధర తగ్గిందంటే..?

ఐఫోన్ 7 ఏఏ మోడల్ పై ఎంతెంత ధర తగ్గిందంటే..?

ఐఫోన్ 7 (32జీబి వేరియంట్) పై రూ.14,000 తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. డిస్కౌంట్ పోనూ ఈ డివైస్‌ను రూ.45,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 7 (256జీబి జెట్ బ్లాక్ కలర్ వేరియంట్) పై రూ.16,000 తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. డిస్కౌంట్ పోనూ ఈ డివైస్‌ను రూ.65,699కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 7 (128జీబి వేరియంట్) పై రూ.17,000 తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. డిస్కౌంట్ పోనూ ఈ డివైస్ ను రూ.52,972కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఐఫోన్ (32జీబి రోజ్ గోల్డ్ వేరియంట్) పై రూ.14,622, రెడ్ కలర్ వేరియంట్ పై 8,000 డిస్కౌంట్‌లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది.

ఐఫోన్ 7 ఫీచర్స్...

ఐఫోన్ 7 ఫీచర్స్...

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ , 4.7 అంగుళాల Retina HD డిస్‌ప్లే, A10 Fusion ప్రాసెసర్‌, iOS 10 ఆపరేటింగ్ సిస్టం, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఐఫోన్ 6ఎస్ తయారీతో పోల్చితే ఐఫోన్ 7 తయారీ ఖర్చు ఎక్కువే...
 

ఐఫోన్ 6ఎస్ తయారీతో పోల్చితే ఐఫోన్ 7 తయారీ ఖర్చు ఎక్కువే...

ఐఫోన్ 6ఎస్ తయారీతో పోలిస్తే ఐఫోన్ 7 తయారీకి యాపిల్‌ కొంచం ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి వచ్చినట్లు ప్రముఖ రిసెర్చ్ సంస్థ IHS Markit Ltd తెలిపింది. పెద్ద బ్యాటరీతో పాటు ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ కెపాసిటీని ఐఫోన్ 7లో నిక్షిప్తం చేయటం కారణంగా దాదుపుగా రూ.2500ను యాపిల్ అదనంగా ఖర్చుచేసినట్లు సదరు బిజినెస్ రిసెర్చ్ ప్రొవైడర్ అంచనా వేసింది.

విశ్లేషణలో ఆసక్తికర విషయాలు..

విశ్లేషణలో ఆసక్తికర విషయాలు..

5 డాలర్ల ప్రాథమిక తయారీ వ్యయంతో కలుపుకుని ఐఫోన్ 7 తయారీ ఖర్చు 224.80 డాలర్లుగా (మన కరెన్సీ ప్రకారం 15067) ఉందని ఐహెచ్‌ఎస్ మార్కెట్ అభిప్రాయపడింది.ఇదే సమయంలో ఐఫోన్6ఎస్ తయారీకి యాపిల్ వెచ్చించిన ఖర్చు ఇంచుమించుగా 188 డాలర్లేనట (మన కరెన్సీ ప్రకారం 12600).

ఇండియా ధర రూ.60,000, అంతర్జాతీయ మార్కెట్లో..?

ఇండియా ధర రూ.60,000, అంతర్జాతీయ మార్కెట్లో..?

అంతర్జాతీయ మార్కెట్లో 32జీబి వర్షన్ ఐఫోన్ 7 ధర $649గా ఉంది. ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7 ప్రారంభ వేరియంట్ ధర రూ.60,000గా ఉంది.

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షే..

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షే..

, మధ్యతరగతి ప్రజానీకానికి మాత్రం యాపిల్ ఐఫోన్ ఓ అందని ద్రాక్షలానే మిగిలింది. మార్కెట్లో రిలీజ్ అయ్యే కొత్త ఐఫోన్‌లను సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి.

ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ ఖర్చు ఎంతంటే..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ ఖర్చు ఎంతంటే..?

IHS సంస్థచెబుతోన్నలెక్కల ప్రకారం ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ ఖర్చు కేవలం 17,000నట. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు మాత్రం 51,000 (విడుదల సమయంలో). అంటే 3 రెట్లు ఎక్కువన్నమాట. ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్) తయారీకి అవసరమయ్యే ముడి మెటీరియల్ ఖర్చు 15,800 మాత్రమేనట. తయారీ వ్యయంతో కలుపుకుంటే 17,000 అవుతుందట.

యాపిల్‌కు భారీ స్థాయిలో లాభాలు

యాపిల్‌కు భారీ స్థాయిలో లాభాలు

ఒక్క ఐఫోన్ యూనిట్‌ను పూర్తిగా అసెంబుల్ చేయాలంటే 24 గంటల సమయం పడుతుందట. ఫోన్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, షిప్పింగ్, లైసెన్సింగ్, మార్కెటింగ్ ఇంకా ఇతర తృతీయ ఖర్చులను కలుపుకున్నప్పటికి ఒక్కో ఐఫోన్ యూనిట్ పై యాపిల్‌కు భారీ స్థాయిలోనే లాభాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

English summary
Apple iPhone 7 available online at a discount of Rs 17,000. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X