సెప్టంబర్ 7న iPhone 7, ప్రపంచంతో పోటీ పడగలదా..?

|

"See you on the 7th" అంటూ యాపిల్ తన అప్‌కమింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్‌లను విడుదల చేసింది. సెప్టంబర్ 7వ తేదీన యాపిల్ నిర్వహిస్తోన్నఈ ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా కొత్త ఐఫోన్‌లతో పాటు అప్‌డేటెడ్ ఫీచర్లతో కూడిన యాపిల్ వాచ్‌లను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది.

సెప్టంబర్ 7న iPhone 7, ప్రపంచంతో పోటీ పడగలదా..?

Read More : రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

గడచిన 5 సంవత్సరాల కాలంగా యాపిల్ సెప్టంబర్ ఈవెంట్‌లను ఏర్పాటు చేస్తూ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది యాపిల్ నుంచి మూడు కొత్త ఐఫోన్‌లు మార్కెట్లో రాబోతున్నట్లు తెలియవచ్చింది. వాటి వివరాలు యాపిల్ iphone 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో. అప్ కమింగ్ యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే అనే రూమర్స్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 1జీబి 4జీ డేటా రూ.51కే!

#1

#1

కొన్ని లీకుడ్ ఇమేజెస్ ప్రకారం ఐఫోన్ 7 డిజైన్ విషయంలో ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే పెద్దగా మార్పు చేర్పులు లేవని తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో యాంటీనా బ్యాండ్స్ కనిపించవు. కెమెరా బంప్‌ను కాస్తంత తగ్గించారు.

#2

#2

ఐఫోన్ 7లో సాంప్రదాయ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కనిపించకపోవచ్చు. ఈ హెడ్‌ఫోన్ జాక్ స్థానంలో రెండు విధాలుగా ఉపయోగపడే లైట్నింగ్ కేబుల్ పోర్ట్‌ను యాపిల్ ఏర్పాటు చేయబోతోంది. ఈ లైట్నింగ్ కేబుల్ పోర్ట్ చార్జింగ్ అలానే హెడ్‌ఫోన్ యూసేజ్ అవసరాలను తీరుస్తుంది.

#3

#3

రూమర్ మిల్స్ ప్రకారం అప్‌కమింగ్ ఐపోన్ 7 మోడల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం. ఈ ఫీచర్ గనుక కన్ఫర్మ్ అయితే ఐఫోన్ 7 కెమెరా క్వాలిటీ కొత్త స్టాండర్డ్స్‌ను నెలకొల్పే అవకాశం ఉంది.

#4

#4

ఐఫోన్ ప్రో పేరుతో యాపిల్ లాంచ్ చేయబోతోన్న అప్‌కమింగ్ ఫోన్ స్మార్ట్ కనెక్టర్ ఫెసిలిటీతో వచ్చే అవకాశం. స్మార్ట్ కీబోర్డ్ వంటి ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను ఈ ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

#5

#5

యాపిల్ ఐఫోన్ 7 అప్‌గ్రేడెడ్ ఏ10 చిప్‌సెట్‌తో పాటు 2జీబి ర్యామ్‌తో వచ్చే అవకాశం. ఇదే సమయంలో ఐఫోన్ 7 ప్లస్ ఏ10 చిప్‌సెట్‌తో పాటు 3జీబి ర్యామ్‌తో వచ్చే అవకాశం.

#6

#6

ఐఫోన్ 7 బ్యాటరీ కెపాసిటీ 7.04 watt-hoursగా ఉండే అవకాశం. ఐఫోన్ 7 ప్లస్ బ్యాటరీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

#7

#7

స్టోరేజ్ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7 బేస్ మోడల్ 32జీబి వేరియంట్‌తో లభ్యమయ్యే అవకాశం. ఇంతకముందు ఐఫోన్ 6ఎస్ బేస్ మోడల్ 16జీబిగా ఉంది.

#8

#8

యాపిల్ తన ఐఫోన్ 7తో పాటు వైర్‌లెస్ ఇయర్‌పోడ్స్‌ను బండిల్డ్ ప్యాక్ క్రింద ఆఫర్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

#9

#9

యాపిల్ ఐఫోన్ 7 ఐదు కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం.. వాటి వివరాలు గ్రే, టైరాంట్ గోల్డ్, బ్లూ, రోజ్ గోల్డ్ , స్పేస్ బ్లాక్.

Best Mobiles in India

English summary
Apple's iPhone 7 event is happening on September 7th. Read Morer in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X