యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

|

యాపిల్ తన మొదటి స్మార్ట్‌వాచ్ ‘యాపిల్ వాచ్'ను ప్రపంచానికి పరిచయం చేసింది. విప్లవాత్మక ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌వాచ్‌ను 2015లో అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ రెండు సైజులలో లభ్యంకానుంది. ఒకటి 30 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్ కాగా మరొకటి 42 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్. ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది. యాపిల్ వాచ్ మొత్తం మూడు ఎడిషన్‌లలో అందుబాటులోకి రానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్‌కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!
 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్ ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

ఈ వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో డిజైన్ చేసినట్లు కంపెనీ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు. మరో వేరియంట్ యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ తెలిపిన వివరాల మేరకు యాపిల్ వాచ్ వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

డెవలపర్ల కోసం వాచ్ కిట్ పేరుతో సరికొత్త వ్యవస్థను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఔత్సాహికులు ఈ వాచ్కిట్‌ను ఉపయోగించుకుని డెవలపర్లు యాపిల్ వాచ్ కోసం కొత్త టూల్స్‌ను వృద్థి చేయవచ్చు.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో ఏర్పాటు చేసిన యాపిల్ పే అనే పేమెంట్ అప్లికేషన్‌ను ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బిల్లులను సౌకర్యవంతంగా అలానే సురక్షితంగా చెల్లించవచ్చు.

 

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్.. 10 ప్రత్యేకతలు!!

యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. వినియోగదారుడి ఫిట్నెస్‌తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్‌కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Apple Watch: 10 important details of the smartwatch. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X