
మీరు వొడాఫోన్ కస్టమరా..?, అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవల్సిందే.. వొడాఫోన్ తమ కస్టమర్ల కోసం ఒక బర్త్‌డే కానుక ప్రవేశపెట్టింది. ఆగస్టు 26 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం బిగ్‌సినిమాస్‌తో ఒప్పందాన్ని ఏర్పరుచుకుంది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా 26వ తేదీలోగా పుట్టిన రోజు గల వొడాఫోన్ కస్టమర్లు బిగ్‌సినిమాస్‌తో ఎంఓయు ఉన్న మల్టిప్లెక్స్‌కు వెలితే గ్రీటింగ్ కార్డుతో ఒక సినిమా టికెట్ ఉచితంగా ఇస్తారు. అలాగే ఇంటర్వల్ టైమ్‌లో స్క్రీన్‌పై కస్టమర్ పేరును బర్త్‌డే జింగిల్‌తో కలిపి ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన బిగ్ సినిమా హాళ్ళలో కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బర్త్‌డే కేక్ కూడా బహుమతిగా అందిస్తారు.






























