మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ అసుస్(Asus) తన జెన్‌ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌లను గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌ను నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించింది. 4జీబి ఇంకా 2జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న అసుస్ జెన్‌ఫోన్ 2 ఫోన్‌లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.(ఇంకా చదవండి: అందుబాటులో లక్ష లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు)

4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉంచిన అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,999. 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉంచిన అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,999. 2జీబి ర్యామ్ + 16 జీబి ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉంచిన అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999. జెన్‌ఫోన్‌2 (ZE550ML) మోడల్ నెంబర్‌లో మరో వేరియంట్‌ను అసుస్ అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999.

ఈ ఫోన్‌లకు సబంధించిన మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

 మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

4జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) వేరియంట్ 64 బిట్ 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి వేరియంట్ 64 బిట్ 1.8గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ రెండు వేరియంట్‌లలో లభ్యమయ్యే ఫోన్‌లు 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

 మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

జెన్‌ఫోన్‌2 (ZE550ML) వేరియంట్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 ప్రాసెసర్‌తో పాటు 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఈ ఫోన్‌లకు సంబంధించిన మెమరీని 64జీబి వరకు విస్తరించుకోవచ్చు.

 

 మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

ఈ ఫోన్‌లకు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 4జీ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, గ్లవ్ టచ్ సపోర్ట్, అసుస్ కొత్త వర్షన్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

 మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

మార్కెట్లోకి అసుస్ జెన్‌ఫోన్ 2

ఈ ఫోన్‌లకు సంబంధించి కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే...హెచ్‌ఎస్‌పీఏ సపోర్ట్, 4జీ ఎల్టీఈ క్యాటగిరీ 4(ఎఫ్‌డీడీ అండ్ టీడీడీ), వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ ఆన్ ద గో.

Best Mobiles in India

English summary
Asus Zenfone 2 Launched in India in Four Variants. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X